సమంతతోపాటు ఆ ఇద్దరు హీరోలు సూసైడ్.. వేణుస్వామి ఆడియో లీక్
టాలీవుడ్ చిత్రాలకు ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. ఎస్ఎస్ రాజమౌళి, సుకుమార్ వంటి దర్శకులు ప్రపంచం మెచ్చే సినిమాలు తీస్తూ తెలుగు సినిమాల ఖ్యాతిని పెంచుతున్నారు. ఓవైపు తెలుగు సినిమా స్థాయిని పెంచేందుకు ప్రముఖులు ప్రయత్నిస్తుంటే... మరికొందరు మాత్రం మూఢనమ్మకాల వలలో చిక్కుకుంటున్నారు. లోకం తెలిసిన సెలబ్రెటీలే భక్తి మార్గంలో నడవాల్సింది పోయి.. మూఢనమ్మకాల వైపు అడుగులు వేతస్తున్నారు. ఆధునిక కాలంలోనూ కొందరు అడ్డగోలు మాటలు చెప్పే స్వాముల మాటలు వింటున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి అందరికీ పరిచయమే. సెలబ్రెటీల జాతలకాలపై సంచలన వ్యాఖ్యలు చేయడం మూలంగా పాపులర్ అయ్యాడు. అందరికీ ఆయన పేరు, ముఖం తెలిసింది. తరుచుగా టాలీవుడ్ లోని బడా హీరోల జాతకాలను చెబుతూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇప్పటికే పలువురిని నుంచి హెచ్చరికలు కూడా అందాయి. అయినా ఆయన తీరుమాత్రం మారడం లేదని తెలుస్తోంది. అయితే తాజాగా టాలీవుడ్ లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ స్కామ్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ విషయమై పలువురు సినీ పండితులు ఓ ప్రధాన మీడియా నిర్వహించిన డిబేట్ లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వేణు స్వామికి సంబంధించిన సంచలన ఆడియో లీక్ అయ్యింది. ఆ వీడియో ప్రకారం... వేణు స్వామి జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా ముగ్గురు స్టార్స్ చనిపోతారని చెప్పారు. ఒక హీరయిన్, ఒక హీరో ఆత్మహత్య చేసుకునే రోజు దగ్గర్లోనే ఉందనడం సంచలనంగా మారింది. స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు, విజయ్ దేవరకొండ, ప్రభాస్ వీరి ముగ్గురి గురించి ఆందోళనకరంగా జ్యోతిష్యం చెప్పడం సంచలనమవుతోంది. శాస్త్రం ప్రకారం సమంత రూత్ ప్రభు, విజయ్ దేవరకొండలో ఎవరో ఒకరు సూసైడ్ చేసుకోవడం ఖామన్నారు. ఇక వేణు స్వామి లెక్క ప్రకారమైతే విజయ్ దేవరకొండ సూసైడ్ చేసుకుంటారంటూ ఆడియోలో మాట్లాడారు.
అన్ని మున్ముందు తెలుస్తాయని, ఇంకా మీడియాకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారని చెప్పినట్టుగా ఆడియోలో రికార్డు అయ్యింది. ఇక ప్రభాస్ గురించి కూడా మాట్లాడుతూ.. ప్రభాస్ కు శరీరమంతా గాయాలే ఉన్నాయని, ఆయన ఎవ్వరికీ చెప్పడం లేదన్నారు. అందుకే రాజాసాబ్ చిత్రాన్ని కూడా పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తున్నారని అభిప్రాయపడ్డారు. ఇవన్నీ ముందు జరగబోతున్నాయని, అన్నీ అయిన తర్వాత మాట్లాడుకుందామని చెప్పుకొచ్చారు..... అయితే జ్యోతిష్యంలో ఇలాంటివి కూడా ఉంటాయా? అని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఇలాంటి ఆందోళనకరమైన జ్యోతిష్యం చెబుతున్న వేణు స్వామిపై అసలు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. పైగా సెలబ్రెటీలు కూడా అలాంటి వ్యక్తితో ప్రత్యేక పూజలు చేయించుకోవడం ఎందుకంటున్నారు. ఇక గతంలోనే వేణు స్వామి ఇష్టమొచ్చినట్టు జాతకాలు చెప్పి హీరోహీరోయిన్ల అభిమానులను ఆందోళనకు గురిచేశారు. ఇప్పటికే ప్రభాస్ అభిమానులు ఆయనపై ఫైర్ అయ్యారు. మరోవైపు ఏపీ ఎలక్షన్ సమయంలోనూ గట్టి దెబ్బ పడింది. పలువురు కేసులు కూడా నమోదు చేశారు. అయినా వేణు స్వామిలో ఎలాంటి మార్పులు కనిపించడం లేదని, ఇండస్ట్రీలోని ప్రముఖులు చిత్ర పరిశ్రమకు మచ్చ తెచ్చేవారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


Click it and Unblock the Notifications











