టాలీవుడ్‌కు గడ్డు పరిస్థితి.. టాప్ ప్రొడ్యూసర్లు దివాళా.. వేణుస్వామి సంచలన జ్యోతిష్యం
జాతకాలను, ముహుర్తాలను విశ్వసించే సినిమా పరిశ్రమపై ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి మరోసారి బాంబు పేల్చాడు. తాజాగా అంటే జూన్ 2 తేదీ నుంచి మారిన గ్రహ స్థితులు గురించి ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ క్రమంలో ఆయన రానున్న కాలంలో ఎలా ఉండబోతుందని విశ్లేషణను కొనసాగిస్తూ సంచలన విషయాలు బయటపెట్టారు. అయితే ఆయన చెప్పిన విషయాలు అటు సిన వర్గాలను, అభిమానులను ఆందోళనకు గురి చేసే విధంగా ఉన్నాయి. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితి నేపథ్యంలో వేణుస్వామి విశ్లేషించిన పరిస్థితులు ఏమిటనే వివరాల్లోకి వెళితే..
తెలుగు సినిమా పరిశ్రమ ఇటీవల కాలంలో సరైన సినిమాలు లేకపోవడం, అగ్ర హీరోలు నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో పరిస్థితి అధ్వాన్నంగా మారింది. కంటెంట్ ప్రధానంగా ఉంటే చిత్రాలకు మాత్రమే ప్రేక్షకులు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. దాదాపు థియేటర్లకు ముఖం చాటేస్తూ ఓటీటీల వైపు మొగ్గు చూపుతుండటం భారీ చర్చకు దారి తీసింది.

ఇదిలా ఉండగా, సినిమా పరిశ్రమను రకరకాల వివాదాలు, సంక్షోభాలు చుట్టుముడుతున్నాయి. ఇటీవల కాలంలో రెమ్యునరేషన్ల గొడవ, అలాగే సమ్మెలు లాంటి చిత్ర పరిశ్రమ కార్యకలాపాలను స్తంభింపజేశాయి. ఇక ఇటీవల కాలంలో రెంటల్ వర్సెస్ పర్సంటేజీ విధానం ఇండస్ట్రీని రెండుగా చీలేలా చేశాయి. తెలుగు, ఆంధ్రా నిర్మాతలు అంటూ చీలిక తెచ్చేలా చేశాయి.
ఇలాంటి పరిస్థితులు ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలో వేణుస్వామి తన జ్యోతిష్య అంచనాలను వెల్లడించారు. గురువు అతిచారం చేస్తుండటం, మూడు గ్రహాల్లో సంచరించడం, సూర్యుడి సవ్య, అపసవ్య గురించి చెప్పారు. గురువు బేస్ చేసుకొని జాతకం చెబుతున్నాను. కర్ణాటక రాశిలో గురువు ప్రవేశిస్తున్నాడు. అక్టోబర్‌లో సింహరాశి, 2027లో కర్కాటక రాశిలోకి ప్రవేశం. ఈ సంవత్సరంలో మూడు రాశుల్లో గురువు ప్రభావం చూపించబోతున్నాడు. కాబట్టి ప్రభావం వల్ల ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాలు ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పారు.
వేణుస్వామి ప్రపంచవ్యాప్తంగా ఏర్పడే విపత్తుల గురించి మాట్లాడుతూ.. తెలుగు సినిమా పరిశ్రమలోని అతి పెద్ద నిర్మాణ సంస్థల్లో 90 శాతం కంపెనీలు దివాళా తీసే ప్రమాదం ఉంది. నష్టాల బారిన పడుతాయి. పెద్ద సంస్థలన్నీ ఆర్థికంగా భారీ నష్టాలను ఎదుర్కొంటాయి. చిత్ర పరిశ్రమకు సంబంధించిన పెద్దలు వారి సంతానం వల్ల ఆ కుటుంబాలకు అగౌరవం ఏర్పడుతాయి అని అన్నారు.
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ ప్రొడక్షన్ హౌస్ వివరాల్లోకి వెళితే.. దిల్ రాజుకు చెందిన ఎస్వీసీ, టీజీ విశ్వప్రసాద్‌కు చెందిన పీపుల్ మీడియా, నాగవంశీకి చెందిన సితార, హారిక క్రియేషన్స్, నవీన్, రవికి చెందిన మైత్రీ మూవీ మేకర్స్, యూవీ క్రియేషన్స్, ఏషియన్ పిక్చర్స్ లాంటి సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలే భారీ సినిమాలను నిర్మిస్తున్నాయి అనే చర్చ జరుగుతున్నది.


Click it and Unblock the Notifications