సెలబ్రెటీల జాతకాలు అందుకే చెబుతున్నా... వేణు స్వామి గుట్టురట్టు!
ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి ఎంత సెన్సేషన్ గా మారిపోయాడో తెలిసిందే. సెలబ్రెటీలకు జ్యోతిష్యం చెప్పుకుంటూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. దాంతో స్టార్ హీరోల జాతకాలపైనా ఒపెన్ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ ఫేమస్ అయ్యారు. ఈయన కూడా ఎక్కువగా సెలబ్రెటీలకే జ్యోతిష్యం చెప్పడం మూలంగా మరింత పాపులర్ అయ్యారు. అన్నింటికంటే ఈయన సెలబ్రెటీల జాతకాలను చెబుతూనే చేసే సంచలనమైన వ్యాఖ్యలతో సెన్సేషన్ గా మారుతూ ఉంటారు. ఆయన కాంట్రవర్సీయల్ ఆస్ట్రాలజీని కూడా చెబుతూ ఎప్పుడూ వార్తల్లోనే నిలుస్తున్నారు.
గతంలో వేణు స్వామి టాలీవుడ్ లోని చాలా మంది హీరోయిన్లకు ప్రత్యేక పూజలు చేయించారు. ఈ విషయం సోషల్ మీడియా వేదికన బయటకి వస్తూనే ఉంది. గతంలో రష్మిక మందన్నకు వారింట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు వేణు స్వామి. ఆ ముందు, ఆ తర్వాత కూడా పలువురు సెలబ్రెటీలకు పూజలు నిర్వహించి వారికి వృత్తిపరంగా మంచి జయం కలగాలని ఆకాంక్షించారు. అయితే వేణుస్వామి ఇంత వరకు బాగానే ఉన్న.. ఒక్కసారిగా సెలబ్రెటీలకు సంబంధించిన నెగెటివ్ విషయాలను, భవిష్యత్ లో వారికి జరిగే ప్రమాదాలను కూడా ఓపెన్ గా చెబుతూ వస్తున్నారు.

కొన్నాళ్లుగా వేణు స్వామి మరి సంచలనంగా తన ప్రిడిక్షన్ ను వినిపిస్తున్నారు. ఎలాంటి ఇంటర్వ్యూల్లోనైనా కొద్ది కాలంగా సెలబ్రెటీల గురించి ఎక్కువగా చెడు విషయాలనే చెబుకుంటూ వస్తున్నారు. త్వరలో ఆయా హీరోలకు, హీరోయిన్లకు ఇలా అలా జరగబోతుందంటూ తమ అభిమానులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాడు. దాంతో ఎన్నో సార్ల విమర్శల పాలయ్యారు. ఆయా హీరోల అభిమానులు వేణు స్వామిని తెగ ట్రోల్ చేస్తూ వచ్చారు. అయిన కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఇక జ్యోతిష్య శాస్త్ర ప్రకారం జరగబోయేదే చెబుతున్నామని చెప్పుకొచ్చారు. తలరాతను మార్చలేకపోయినా.. తమ పూల ద్వారా వాటి ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని, కొన్ని సందర్భాల్లో లక్ష్యాలను చేధించే విషయంలోనూ సక్సెస్ కావొచ్చని చెప్పుకుంటూ వస్తున్నారు.
అయితే, వేణు స్వామి రీసెంట్ రెబల్ స్టార్ ప్రభాస్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు, టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకు సంబంధించిన ఆడియోను ఇటీవల ప్రముఖ టీవీ ఛానెల్ నిర్వహించిన డిబెట్ లో వినిపించారు. దాంతో మరోసారి వేణు స్వామి పేరు తెరపైకి వచ్చింది. ఆయన సెలబ్రెటీలపై చేసిన మాటలతో మరోసారి దుమారం రేగింది. ప్రభాస్ కు మరో ఆరు నెలల్లో ప్రమాదం ఉందని, ఒంటినిండా గాయాలతో సతమతమవుతున్నాడని చెప్పారు. అలాగే సమంత లేదంటే విజయ్ దేవరకొండ సూసైడ్ చేశుకుంటారని చెప్పినట్టు ఆడియోలో రికార్డు అయ్యింది.

కాగా, ఆ ఆడియో బయటకి రావడంతో ప్రభాస్, సమంత రూత్ ప్రభు, విజయ్ దేవరకొండ అభిమానులు ఎంతగానో ఆందోళన పడుతున్నారు. మరోవైపు తమ అభిమాన నటులపై సంచలన వ్యాఖ్యలు చేసిన వేణు స్వామిపై మండిపడుతున్నారు. వీలైతే మంచి మాట్లాడాలి గానీ ఇలా చెడు విషయాలను వ్యాప్తి చేయడం ఎందకని ప్రశ్నిస్తున్నారు. అయితే తాజాగా వేణు స్వామి ఇలాంటి అంశాలపై స్పందించారు. అసలు తను ఎందుకు సెలబ్రెటీలకే జ్యోతిష్యం చెబుతున్నాడో అసలు విషయాన్ని రీసెంట్ ఇంటర్వ్యూలో వేణు స్వామి వివరించారు. ఆయన మాటలు మరింత సంచలనంగా మారాయి.
వేణు స్వామి రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టాలీవుడ్ సెలబ్రెటీలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది తప్పకుండా జరుగుతుందన చెప్పారు. తను ఊహించి చెప్పిన విషయాలన్నీ ఏమాత్రం పొల్లుపోకుండా జరిగాయని గుర్తు చేసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా టాలీవుడ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువ జంట విడిపోతుందని చెప్పడం జరిగిందన్నారు. మరోవైపు టాలీవుడ్ కు సంబంధించిన స్టార్ హీరోయిన్ మూడేళ్ల కిందనే ఎవరికీ తెలియకుండా తన ప్రియుడితో పెళ్లి చేసుకుందని, హనీమూన్స్ కు కూడా వెళ్లి వస్తుందని చెప్పారు. అలాగే ఓ తమిళ స్టార్ హీరో, ఇటీవల పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నటుడు కూడా ఈ ఏడాది చివర్లలో విడాకులు తీసుకొని మరో హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్నారని కూడా తెలిపారు.

మరోవైపు ప్రభాస్ విషయంలో మరో ఆరునెలల్లో జరిగేది ఇదేనంటూ ట్విస్ట్ ఇచ్చాడు. ఇక సినీ ఇండస్ట్రీలోని తారలు ప్రత్యేక పూజలతో లబ్ది పొందుతున్నారని చెప్పారు. అయితే అంతా మంచే జరిగితే తనపై పెద్ద ఎత్తున విమర్శలు ఎందుకు వస్తున్నాయని ఎదురైనా ప్రశ్నకు ఆసక్తికరంగా బదులిచ్చాడు. ఎవరైనా తమ వృత్తిలో పైకి వచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు. అందుకు తగిన విధంగా ప్రమోట్ చేసుకుంటూ ఉన్నారు. ఇక నేను కూడా పాపులర్ కావాలనే సెలబ్రెటీలకు సంబంధించిన జ్యోతిష్యాలను చెబుతూ ఉన్నానంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. సెలబ్రెటీల జాతకాలను చెప్పడంతో పాటు పాపులారిటీ కోసం కూడా పలువురికి జ్యోతిష్యం చెప్పానని చెప్పారు.
విమర్శల గురించి ఆలోచించడం సరికాదన్నారు. వారికి జ్యోతిష్యం గురించి అవగాహన లేక అలా మాట్లాడుతున్నారంటూ తన వెర్షన్ ను వినిపించారు. ఆ మధ్యలో తను పూజలు చేయడం వల్లనే యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ కు భారీ చిత్రాల్లో అవకాశాలు అందాయని చెప్పారు. తను కొన్ని ప్రత్యేకమైన పూజలు నిర్వహించిన తర్వాతనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' చిత్రంలో హీరోయిన్ గా ఆఫర్ వచ్చిందని చెప్పారు. అలాగే ప్రభాస్ 'రాజాసాబ్' మూవీలో కూడా నటించే ఛాన్స్ ను దక్కించుకుందని చెప్పారు. ఇక అంబానీ లాంటి వారే ప్రమోషన్స్ కోసం వేల కోట్లు ఖర్చుచేస్తున్నారని, తను కూడా పాపులారిటీ కోసం ప్రయత్నించడంలో తప్పేంటని ప్రశ్నించారు. ఎవ్వరూ ఏమన్నా తన జ్యోతిష్యంలో తప్పులుండవని చెప్పుకొచ్చారు.
ఇక వేణు స్వామి భార్య వీణశ్రీ కూడా వీణ వాయించడంలో మంచి గుర్తింపు దక్కించుకుంది. వేణు స్వామిలానే ఆమె కూడా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తూ ఉంటారు. కొద్దిరోజులుగా ఈ సెలబ్రెటీ ఆస్ట్రాలజర్, వీణశ్రీ కూడా రీల్స్ చేస్తూ కూడా ఆకట్టుకుంటున్నారు. మరింతగా తమ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. ఇక వేణు స్వామి సెలబ్రెటీలకు చేసే పూలను బట్టి రూ.50 లక్షల వరకు కూడా ఛార్జ్ చేస్తారంట. చాలా మంది సినీ ప్రముఖులు, సెలబ్రెటీలు తన వద్దకు వచ్చి జాతకాలు చూపించడంతో పాటు ప్రత్యేక పూజలు కూడా చేయించుకుంటారని చెప్పారు.


Click it and Unblock the Notifications











