రామ్ చరణ్ కూతురు చరిత్ర సృష్టిస్తుంది.. మగ సంతానం కష్టమే.. మెగా ప్రిన్సెస్ జాతకం ఇదే!

మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో మెగా ప్రిన్సెస్ అడుగు పెట్టిన విషయం తెలిసిందే. జూన్ 20న తెల్లవారు జామున రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో 11 ఏళ్లకు రామ్ చరణ్-ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. మెగా ఫ్యామిలీలోకు మహాలక్ష్మీ వచ్చిందంటూ మెగాస్టార్ నుంచి సెలబ్రిటీలు, నెటిజన్ల వరకు సంతోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా ప్రిన్సెస్ జాతకం హాట్ టాపిక్ గా మారింది. సెలబ్రిటీల వివాహాలు, విడాకులు, సినిమా హిట్స్, ప్లాప్స్ వంటి విషయాలను జాతకం ద్వారా చెప్పే వేణు స్వామి తాజాగా రామ్ చరణ్ కూతురు గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు.

ముహుర్తం ప్రకారం:కొణిదెల వంశంలోకి మెగా ప్రిన్సెస్ వచ్చింది. దీంతో మెగా ఫ్యామిలీలో ఆనందం వెల్లు వెరిసింది. మంగళవారం తెల్లవారు జామున ముహుర్తం ప్రకారం ఆపరేషన్ ద్వారా పాపను బయటకు తీశారు అపోలో వైద్యులు. అయితే చిన్నారి జాతకం ఎలా ఉందో ప్రముఖ జోతిష్యుడు, సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ గా గుర్తింపు పొందిన వేణు స్వామి వీడియో విడుదల చేశారు.

Astrologer Venu Swamy Reveals Ram Charan Daughter Mega Princes Horoscope

నక్షత్రాలు:"రామ్ చరణ్-ఉపాసనలకు అమ్మాయి పుట్టింది. మంగళవారం తెల్లవారు జామను 1.46 నిమిషాలకు, పునర్వసు నక్షత్రం రెండో పాదం, మిథున రాశి, జన్మనామం కోణంగి. ఈ ముగ్గురు (రామ్ చరణ్, ఉపాసన, మెగా ప్రిన్సెస్) నక్షత్రాలు చూసుకుంటే రామ్ చరణ్ ది రోహిణి, ఉపాసన గారిది కృతికా నక్షత్రం. అలాగే వారికి పుట్టిన పాపది పునర్వసు నక్షత్రం" అని వేణు స్వామి తెలిపారు.

రాజయోగం ఉంది:"కొణిదెల వంశానికి సంబంధించి చూస్తే రామ్ చరణ్ ది కృష్ణుడి నక్షత్రం. ఇప్పుడు పుట్టిన పాపది రాముడి నక్షత్రం. ఉపాసన గారిది అమ్మ వారి నక్షత్రం. ఈ మూడు నక్షత్రాలు దేవతా అంశం కలిగినవే. చిన్నారికి రాజయోగం స్పష్టంగా కనిపిస్తోంది. గురు ఛండాల యోగం అనేది ఉంది. చిరంజీవికి ఉన్న యోగమే ఉంది. ఈ అమ్మాయి జాతకం వల్ల కొణిదెల వంశానికి రాజయోగం ఉండబోతుంది" అని వేణు స్వామి వెల్లడించారు.

Astrologer Venu Swamy Reveals Ram Charan Daughter Mega Princes Horoscope

పై స్థాయిలో పేరు:"చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, పాప ఈ ఐదుగురు గురించి మాత్రమే మాట్లాడుతున్నా. ఈ ఐదుగురి జాతకంలో రాజయోగం ఉంది. ఈ పాప రాబోయే కాలంలో చరిత్ర సృష్టించబోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. చిరంజీవి గారికి ఉన్నంత పేరు, అలాగే రామ్ చరణ్ కు ఉన్నంత పేరు కంటే కూడా పై స్థాయిలో ఉండే అవకాశం ఉంది" అని వేణు స్వామి పేర్కొన్నారు.

Astrologer Venu Swamy Reveals Ram Charan Daughter Mega Princes Horoscope

సింగిల్ చైల్డ్:"ఈ పాప జన్మించడం వల్ల తల్లికి, తండ్రికి, తాతకు అందరికీ కలిసి వస్తుంది. ఎందుకుంటే ఆమె చాలా రేర్ కాంబినేషన్ లో జన్మించింది. కాకపోతే ఈ అమ్మాయి జాతకంలో చిన్న చిన్న మైనస్ లు ఉన్నాయి. పంటికి, చెవికి సంబంధించిన సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ బిడ్డ తర్వాత రామ్ చరణ్-ఉపాసనకు మరో సంతానం ఉండకపోవచ్చు. పాప జాతకాన్ని చూస్తే సింగిల్ చైల్డ్ గా ఉండే అవకాశం ఉంది" అని వేణు స్వామి చెప్పుకొచ్చారు.

Astrologer Venu Swamy Reveals Ram Charan Daughter Mega Princes Horoscope

లక్ష్మీ దేవి పుట్టింది:"చిరంజీవి కుటుంబంలో ఇక మగ సంతానం ఉండకపోవచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ చిన్నారి పుట్టుకతో మెగా ఫ్యామిలీకి మరిన్ని మంచి రోజులు రాబోతున్నాయి. నిజంగానే లక్ష్మీదేవి పుట్టింది. చిరంజీవి మనువరాలు చాలా మంచి జాతకురాలు" అని వేణు స్వామి వెల్లడించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్, వీడియో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X