వేణుస్వామి నిజ స్వరూపం ఇదే.. రెడ్ హ్యాండెడ్‌గా అలా చిక్కిన జ్యోతిష్య పండితుడు
శకునం చెప్పే బల్లి కుడితిలో పడినట్టు.. అందరి జాతకాలను, లైఫ్‌లను డిసైడ్ చేసే వేణుస్వామి పరిస్థితి ప్రస్తుతం చాలా గందరగోళంగా మారింది. ఆయన చెప్పిన జోస్యాలు.. సారీ అంచనాలు తలకిందులు కావడంతో సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్‌కు గురి అవుతున్నారు. అయితే తనకు ఎదురైన పరిస్థితులను తట్టుకొనేందుకు ఆయన ఇటీవల పబ్‌లో కనిపించడం మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఆ వివరాల్లోకి వెళితే..
సినీ నటులు, రాజకీయ నేతలను టార్గెట్ చేసుకొని యూట్యూబ్ ఇంటర్వ్యూల్లో తనకు తోచిన విధంగా జోస్యాలు చెప్పడం కొంత వరకు వేణు స్వామికి వర్క్ అయ్యాయి. అయితే ఇటీవల కాలంలో పూర్తిగా బెడిసి కొట్టడమే కాకుండా ఏకంగా ఆయన అస్థిత్వానికే ముప్పు తెల్చేలా మారాయి. దాంతో ఆయన జోస్యంలో, జాతకాలు చెప్పడంలో నమ్మకం ఎంత అనే విషయంపై అనుమానాలు రేకెత్తాయి.

ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నుంచి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వరకు ఆయన చెప్పిన ఊహాతీత అంచనాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. రేవంత్ రెడ్డీకి రాజయోగం లేదు. కేసీఆర్ తప్పకుండా మళ్లీ సీఎం అవుతాడని బల్లగుద్ది చెప్పే ప్రయత్నం చేశాడు.
ఇక ఏపీ ఎన్నికల్లో వైఎస్ జగన్‌కు ఎదురే లేదు. చంద్రబాబుకు ఇప్పట్లో మళ్లీ రాజయోగం లేదు. పవన్ కల్యాణ్ సీఎం అయ్యే పరిస్థితి కూడా లేదు అంటూ తనదైన శైలిలో జోస్యం చెప్పారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఆయన చెప్పిన రెండు జోస్యాలు డిజాస్టర్‌గా మారాయి. దాంతో ఆయనకు ఉన్న అంతో ఇంతో.. క్రేజ్ కూడా పోయిన పరిస్థితి ఉంది.
ఇదిలా ఉండగా.. వేణుస్వామి ఆదివారం రోజున బాగా ముస్తాబై.. కళ్లకు గాగుల్స్ పెట్టుకొని టింగురంగడిలా ఆయన పబ్‌లో దర్శనమిచ్చే సరికి అందరూ అవక్కాయ్యాడు. వెంటనే ఆయన ఫోటోలు సోషల్ మీడియాలోను, వాట్సాప్ గ్రూపుల్లోను చక్కర్లు కొట్టడం మొదలయ్యాయి. దాంతో ఆయన మరోసారి వైరల్ అయ్యాడు.
అయితే జోస్యం చెప్పే ఆయనకు ఈ వేషాలు అవసరమా? గుట్టు చప్పుడు కాకుండా తన పని తాను చేసుకొంటే అయిపోయేది. ఇలా పబ్, రెస్టారెంట్లలో మందుకొట్టడం అవసరమా? ఆయన నిజస్వరూపం ఇదేనా అంటున్నారు. అయితే తాను మందు తాగడంపై ఆయన ఎప్పుడో బహిరంగంగానే చెప్పారు. నేను పబ్‌కు వెళ్తాను.. అందులే ఎలాంటి అనుమానాల్లేవని చెప్పి.. నిజంగానే తన నిజస్వరూపాన్ని మరోసారి పరిచయం చేశాడు.


Click it and Unblock the Notifications











