Venu Swamy: టాక్సిక్ హీరో యశ్‌పై వేణు స్వామి జోస్యం.. స్టార్‌డమ్ నిలబెట్టుకోలేక డిప్రెషన్ అంటూ..
ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా సినీ ప్రముఖుల జాతకాలు, భవిష్యవాణులు చెబుతూ ఆయన ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. జ్యోతిష్యంతో పాటు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించడం ద్వారా కూడా ఆయన సోషల్ మీడియాలో తరచూ ట్రెండ్ అవుతుంటారు. ప్రముఖ హీరోయిన్లు రష్మిక మందన్నా, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, పూర్ణ, ప్రగతి వంటి పలువురు నటీమణులు తమ వ్యక్తిగత, వృత్తి సంబంధిత విషయాల కోసం ఆయనతో ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఇలా సెలబ్రిటీల జాతకాలు చెప్పే వేణు స్వామి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి కన్నడ స్టార్ హీరో యష్ (Yash)పై షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో యశ్ అభిమానులు వేణుస్వామిపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఇంతకీ ఏమన్నారంటే?
వైరల్ అవుతున్న పాత ఇంటర్వ్యూ
కొన్ని నెలల క్రితం ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన యశ్ ప్రస్తుత పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 'యశ్ అనే ఒక హీరో ఉన్నాడు. అతను కన్నడ హీరో కాబట్టి ధైర్యంగా మాట్లాడుతున్నాను. అదే తెలుగు హీరో అయితే నేను మాట్లాడేవాడిని కాదు. ప్రస్తుతం యశ్ పరిస్థితి అంతగా బాగోలేదు. అతను డిప్రెషన్‌లో ఉన్నాడు. ఎందుకంటే కేజీఎఫ్ సినిమాలు భారీ విజయాలు సాధించాయి. ఇప్పుడు ఆ స్థాయిలో మళ్లీ సినిమా చేయాలనే ఒత్తిడిలో యశ్ ఉన్నాడు' అని వేణుస్వామి వ్యాఖ్యానించారు.

అభిమానుల ఆగ్రహం
ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుండటంతో యశ్ అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. తమ హీరోపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని, వెంటనే క్షమాపణలు చెప్పాలని వేణుస్వామిని డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ, 'రాఖీ భాయ్ డిప్రెషన్‌లో లేడు, తన కెరీర్‌పై మరింత ఫోకస్ పెట్టాడు' అంటూ వేణుస్వామి వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. కన్నడ సినీ వర్గాలు, అభిమానులు మాత్రం యశ్‌పై వచ్చిన ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతున్నారు. వారి మాటల్లో, యశ్ డిప్రెషన్‌లో లేడు, తన కెరీర్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే పట్టుదలతో ఉన్నాడు. KGF సినిమాల తర్వాత వచ్చిన భారీ అవకాశాలను వెంటనే ఒప్పుకోకుండా, అంతకంటే గొప్ప సినిమా చేయాలనే లక్ష్యంతో యశ్ చాలా సమయం తీసుకున్నాడని వారు పేర్కొంటున్నారు.
'టాక్సిక్' సినిమాపై అంచనాలు
ఇదిలా ఉండగా యశ్ ప్రస్తుతం టాక్సిక్ (Toxic) సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకి మలయాళ దర్శకురాలు గీతు మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా మొదట మార్చి 19న విడుదల చేయాలని భావించారు. అయితే.. కొన్ని అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా ఈ సినిమాను వాయిదా వేసి, జూన్ 4కు విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు, యశ్ మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన రామాయణ (Ramayana)లో కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన రావణుడి పాత్రను పోషిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కూడా భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోంది.
వేణుస్వామి వివాదాలు కొత్తవి కావు
ఇదిలా ఉండగా సెలబ్రిటీల జాతకాలు చెబుతూ వివాదాల్లో నిలవడం వేణుస్వామికి కొత్త విషయం కాదు. గతంలో కూడా పలువురు సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాలపై వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి. ఇప్పుడు యశ్‌పై చేసిన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ వివాదంపై వేణుస్వామి ఎలా స్పందిస్తారో చూడాలి. మరోవైపు అభిమానులు మాత్రం తమ హీరోపై వచ్చిన ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ సోషల్ మీడియాలో స్పందనలు వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











