పెద్దాయన నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు.. అందరి చిట్టా నా దగ్గరే... వేణుస్వామి

సెలబ్రిటీ జ్యోతిష్యుడిగా తెలుగునాట గుర్తింపు తెచ్చుకున్నారు వేణుస్వామి. హీరోలు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖుల వ్యక్తిగత జాతకాలు, వారికి ఎదురవనున్న గండాల గురించి ముందే జ్యోస్యాలు చెబుతూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన చెప్పిన జ్యోస్యాలలో కొన్ని ఫలించడంతో ప్రముఖులు ఆయన ఇంటికి క్యూకట్టారు. ఇక కష్టాల్లో ఉన్న హీరోయిన్లు, ఇతర సెలబ్రిటీలకు తన ఇంట్లో, కామాఖ్య అమ్మవారి ఆలయంలో ప్రత్యేక తాంత్రిక పూజలతో వేణుస్వామి మరింత పాపుపలర్ అయ్యారు. ఈ పూజలు చేయించుకున్న వారిలో కొందరు మంచి స్థితికి చేరడంతో మిగిలిన వారికి గురి కుదిరింది.

లెక్క తప్పిన వేణుస్వామి జ్యోస్యాలు
అయితే వేణుస్వామి జ్యోస్యాలు కొన్నిసార్లు లెక్క తప్పాయి. తెలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, క్రికెట్ ప్రపంచకప్ తదితర సందర్భాలలో వేణుస్వామి ప్రిడిక్షన్స్ తలకిందులయ్యాయి. దాంతో ఆయనపై ట్రోలింగ్ జరిగింది. ఇక అక్కినేని నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల వైవాహిక జీవితంపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపడంతో పాటు ఏకంగా తెలంగాణ మహిళా కమీషన్ సీరియస్ అయ్యే వరకు పరిస్ధితి వెళ్లింది. దాంతో సెలబ్రిటీల వ్యక్తిగత జాతకాల గురించి చెప్పనని తెలిపారు వేణుస్వామి. ఈ వ్యవహారాలతో కొన్నాళ్లు సైలెంట్ అయిన ఆయన ఈ మధ్యకాలంలో తిరిగి యాక్టీవ్ అయ్యారు. ఇటీవలి కాలంలో ఛానెల్స్‌కు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణుస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

Astrologer Venu Swamy speaks about his long journey in Tollywood and controversies over predictions

చిరంజీవి పక్కన నటించాల్సింది
వేణుస్వామికి నటీనటులు, ఇతర సెలబ్రిటీల డేట్ ఆఫ్ బర్త్, నక్షత్రాలు ఎలా తెలుస్తున్నాయని యాంకర్ అడగ్గా.. ఆపద్బాంధవుడు సినిమాలోని చిరంజీవి పక్కన ఒక బ్రాహ్మణుడి క్యారెక్టర్ ఉంటుంది. అది నేను చేయాల్సింది. ఇది 1993 నాటి సినిమా. అంటే వేణుస్వామి అనేవాడు 1993 నుంచే ఉన్నాడు. వేణుస్వామి పూజ చేసిన ఫస్ట్ సినిమా ప్రాణ స్నేహితులు 1988. వేణుస్వామికి ప్రభాస్ జాతకం ఎలా తెలుసు? కేసీఆర్ జాతకం ఎలా తెలుసు? అని అందరూ అడుగుతారు. తెలుగు రాష్ట్రాల్లో ఇంతమంది తోపులు, తురుములు ఉండగా వేణుస్వామికే నక్షత్రాలు ఎలా తెలుసు అని డౌట్. ఘరానా మొగుడు వేణుస్వామి ముహూర్తం పెట్టాడు, ఎంఎస్ రెడ్డిగారితో పూజలు చేయించా. ఎంఎస్ రెడ్డి గారు అంటే మల్లెమాల ఓనర్ శ్యాంప్రసాద్ రెడ్డి వాళ్ల నాన్న. మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి వియ్యంకుడు. ఇది నా లెవల్ అని వేణుస్వామి అన్నారు.

చంద్రబాబును సీఎంగా కూర్చోబెట్టా
జూన్ 4, 1998న నరసింహనాయుడు సినిమా ఓపెనింగ్ నేనే చేశాను. మహేశ్ బాబును సినిమా ఇండస్ట్రీలో నిలబెట్టడానికి నా సొంత డబ్బులతో పద్మాలయా స్టూడియలో పూజ చేశా. వంశీ సినిమా షూటింగ్ టైంలో ఒక్క పైసా కూడా ఆయన దగ్గరి నుంచి తీసుకోలేదు. తెలుగు సాంప్రదాయం, తమిళనాడు సాంప్రదాయం అని ఉంటాయి. తెలుగు సాంప్రదాయంలో నక్షత్రం అడగరు, తమిళనాడు సాంప్రదాయంలో నక్షత్రం అడుగుతారు. నేను తమిళనాడు సాంప్రదాయాన్ని ఫాలో అవుతాను. చంద్రబాబు నాయుడు గారింట్లో పదేళ్లు పూజలు చేశాను. 1994లో ఆయనను ఫైనాన్స్ మినిస్టర్‌గా, రెండు సార్లు సీఎంగా కూర్చోబెట్టా. ఈనాడు పేపర్ కటింగ్స్ చూస్తే అందులో నా ఫోటో, నా బావగారి ఫోటో ఉంటాయి. మా బావగారు ఇంకా చంద్రబాబు నాయుడు గారింట్లో కంటిన్యూ చేస్తున్నారు. చంద్రబాబు గారింట్లో పూజ చేసేటప్పుడు మీ నక్షత్రం ఏంటీ? అని అడిగితే ఆన్సర్ వస్తుందా? లేదా?. జూనియర్ ఎన్టీఆర్ గారి అదుర్స్ సినిమాకు నేను పూజ చేశా.. అప్పుడు మీ నక్షత్రం ఏంటీ? అని అడిగితే ఎన్టీఆర్ చెబుతారు కదా అని వేణుస్వామి తెలిపారు.

ఆ బాంబ్ బ్లాస్ట్ నా పక్కనే
పవన్ కళ్యాణ్‌ను నక్షత్రం ఏంటి అని అడిగే చొరవ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయికి, సుస్వాగతానికి పూజలు చేసిన నాకు ఉంటుంది. చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి పీరియడ్‌లో నేను పనిచేశాను. నాకు 13 సంవత్సరాలు వయసులో నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చా.. కాబట్టి సినిమా ఇండస్ట్రీ, పొలిటికల్ రంగాలకు సంబంధించిన ప్రతి వ్యక్తికి సంబంధించిన నక్షత్రం, డేట్ ఆఫ్ బర్త్ నా దగ్గర ఉంది. వేణుస్వామి జీవితమంతా గడిచిందే పద్మాలయా స్టూడియోలో, ఫిలింనగర్ రోడ్ల మీద. శ్రీరాములయ్య సినిమా ఓపెనింగ్ నేను చేశా.. బాంబు బ్లాస్ట్ నా పక్కనే జరిగింది. పరిటాల రవిగారి ఇంట్లో నాకు 13 సంవత్సరాలు, 14 సంవత్సరాలు ఉన్నప్పుడు పూజ చేశానని వేణుస్వామి పేర్కొన్నారు.

హీరోలంతా ఆఫ్ట్రాల్.. నాకు క్లయింట్స్ మాత్రమే
నేను వచ్చే టైంకి సినిమా పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్‌కి వచ్చింది. పద్మాలయా, అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలు ఏర్పాటయ్యాయి. అప్పట్లో సినిమా షూటింగ్‌లు జరిగేటప్పుడు ఇంత సెక్యూరిటీ ఉండేది కాదు.. చిరంజీవి గారి పక్కనే వెళ్లి కుర్చీలు వేసుకుని కూర్చొవచ్చు. ఆ విధంగా పెద్ద ఎన్టీఆర్ గారి దగ్గరి నుంచి మొదలుపెడితే.. ఇవాళ్టీ చిన్న హీరోల వరకు అందరి డేటా నా దగ్గరుంది. జూనియర్ ఎన్టీఆర్ నక్షత్రం ఒకటి, జూనియర్ ఎన్టీఆర్ చేసుకునే బర్త్ డే ఒకటి. వేణుస్వామిని కలిసేవాళ్లు చాలా పెద్దవాళ్లు. అది కూడా సీక్రెట్‌గా కలుస్తారు. మీకు వీళ్లంతా సూపర్‌స్టార్స్.. నాకు సూపర్‌స్టార్ కాదు. నాకు ఆప్ట్రాల్ క్లయింట్స్ మాత్రమే.. నవగ్రహాలు కంట్రోల్ చేసే మనుషులు మాత్రమేనని వేణుస్వామి అన్నారు.

More from Filmibeat

Read more about: venu swamy prabhas jr ntr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X