Venu Swamy : టక్కరి దొంగలా మారిన వేణుస్వామి.. గెటప్ మార్చి ఫాంహౌస్‌లో చిల్!

సినీ, రాజకీయ ప్రముఖుల వ్యక్తిగత జాతకాలు చెబుతూ సెలబ్రెటీగా మారిపోయారు వేణుస్వామి. ఈయన చెప్పిన చాలా జోస్యాలు చాలా వరకు ఫలించడంతో ఎంతోమంది వేణుస్వామి ఇంటికి క్యూకట్టారు. ముఖ్యంగా అక్కినేని నాగచైతన్య- సమంత విడిపోతారని ఆయన చెప్పిన ప్రిడిక్షన్ నూటికి నూరుశాతం నిజం కావడం సంచలనం సృష్టించింది. సెలబ్రెటీలకు ఏమైనా సమస్యలు ఉంటే వారి కోసం ప్రత్యేకంగా పూజలు జరిపించడంతో వేణుస్వామి పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. అయితే అనుకోకుండా ఈ మధ్య ఆయన కొన్ని సమస్యల్లో చిక్కుకున్నారు. ఈ వివాదం తర్వాత వేణుస్వామి ఏం చేస్తున్నాడనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ వివరాల్లోకి వెళితే..

రష్మిక మందన్న, సమంత, డింపుల్ హయాతి, అషు రెడ్డి, నిధి అగర్వాల్ ఇలా పలువురు హీరోయిన్లకు పూజలు చేయించాడు వేణుస్వామి. అయితే సదరు పూజల్లో మద్యం, వైన్ బాటిళ్లు కనిపించడంతో కాంట్రవర్సీలు కూడా అయ్యాయి. కానీ పైన ప్రస్తావించిన వారిలో కొందరి కెరీర్‌లు నిలబడటంతో వేణుస్వామి వద్దకు హీరోలు, హీరోయిన్లు, రాజకీయ నాయకులు బారులు తీరారు. అయితే వేణుస్వామి చెప్పే జోస్యం తేడా కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి.

astrologer venu swamy spent his time at farm house video goes viral

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విషయంలో ఆయన చెప్పే మాటలు ఎప్పుడూ ఫలించకపోగా, కాంట్రవర్సీకి దారి తీశాయి. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ గెలుస్తారని వేణుస్వామి చెప్పారు. కానీ బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఐపీఎల్‌లో హైదరాబాద్ గెలుస్తుందన్నారు కానీ .. ఫైనల్‌లో సన్‌రైజర్స్ బొక్కబొర్లా పడింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ సీఎం కాకుండా ఎవరూ ఆపలేరని చెప్పగా.. ఇక్కడ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో వేణుస్వామిపై నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగారు.

కొద్దిరోజుల క్రితం నాగచైన్య - శోభిత ఎంగేజ్‌మెంట్ జరిగింది. వారిద్దరి జాతకం కలవలేదని ఈ జంట 2027లో విడిపోతారని వేణుస్వామి జోస్యం చెప్పాడు. ఆ మాటలతో అక్కినేని ఫ్యాన్స్‌కి ఎక్కడో కాలింది.. అంతే వేణుస్వామిపై విరుచుకుపడ్డారు. అంతేకాదు.. దీనిపై పోలీస్ స్టేషన్‌పై కేసులు నమోదు కాగా, తెలంగాణ మహిళా కమీషన్ వరకు విషయం వెళ్లింది. వేణుస్వామి హైకోర్టును ఆశ్రయించి ఉపశమనం పొందారు. ఈ వివాదం సద్దుమణగక ముందే టీవీ 5 మూర్తి తనను డబ్బు కోసం వేధిస్తున్నాడని వేణుస్వామి, ఆయన భార్య వీణ శ్రీవాణిలు వీడియో రిలీజ్ చేసి కలకలం రేపారు. ఈ ఆరోపణలపై మూర్తి కూడా అంతే ఘాటుగా స్పందించారు.

కొద్దిరోజుల పాటు ఈ వివాదం మీడియాలో హైలైట్‌గా నిలవగా.. బిగ్‌బాస్‌లో వేణుస్వామి ఆఫర్ మిస్ అయినట్లుగా వార్తలు వచ్చాయి. రెండు గ్రూపులు సైలెంట్ కావడంతో వివాదం సద్దుమణిగింది. మరి ఇప్పుడు వేణుస్వామి ఏం చేస్తున్నట్లు అని ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూశారు. తాజాగా తన ఫాంహౌస్‌లో చిల్ అవుతున్న వీడియోను ఆయన షేర్ చేశారు. దానికి మహేశ్ బాబు మూవీ టక్కరి దొంగలోని నలుగురికి నచ్చనిది అనే సాంగ్‌ని బ్యాక్‌గ్రౌండ్‌గా పెట్టారు. ప్రస్తుతం వేణుస్వామి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Read more about: venu swamy tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X