శోభిత, నాగచైతన్య దాంపత్య జీవితంపై మరో జ్యోతిష్కుడు సంచలనం.. వేణుస్వామిని మించి హాట్ కామెంట్
టాలీవుడ్ హీరో, హీరోయిన్లు నాగచైతన్య, శోభితా ధూళిపాల పెళ్లిపై రకరకాల ఊహాగానాలు, కథనాలు, జ్యోతిష్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు వారం రోజులుగా వారిద్దరి వ్యక్తిగత జీవితాలు గురించి చర్చ జరగడంతో సోషల్ మీడియాలో శోభితా ధూళిపాల టాప్ ట్రెండింగ్‌గా నిలిచింది. ఇలాంటి పరిస్థితుల్లో వివాదాస్పద జ్యోతిష్కుడు వేణుస్వామి తర్వాత మరో ఆస్ట్రాలజర్ తాజాగా ఇద్దరి దాంపత్య జీవితం ఎలా ఉండబోతుందనే విషయంపై తన అభిప్రాయాలను పంచుకొన్నారు. ఆ జ్యోతిష్యుడు చెప్పిన విషయాలు ఏమిటంటే?
శోభితా, చైతూ నిశ్చితార్థం తర్వాత వారిద్దరి సంసారం ఎలా ఉండబోతుందనే విషయంపై వేణుస్వామి చెప్పిన జాతకం అత్యంత వివాదాస్పదంగా మారింది. తెలుగు ఫిలిం జర్నలిస్టులు ఆయన జ్యోతిష్యంపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో ఆ సంస్థ అతడికి నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా అరెస్ట్ కూడా చేయవచ్చనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

బాలీవుడ్‌కు చెందిన జ్యోతిష్యుడు చెప్పిన జాతకం వేణు స్వామి వెల్లడించిన విషయాలకు భిన్నంగా ఉండటం కొంత ఊరటగా చెప్పుకోవాలి. వీరిద్దరి పెళ్లి 2025 సంవత్సరం మొదటి భాగంలో జరిగితే.. వారి దాంపత్య జీవితానికి ఢోకా ఉండదు. వారి సంసారం ఎలాంటి సమస్యలు లేకుండా సాగుతుంది అని చెప్పారు.
శోభితతో నాగచైతన్య పెళ్లి నిశ్చితార్థం ఆగస్టు 8వ తేదీ ఉదయం 9.42 గంటలకు జరిగింది. అలాగే న్యూమరాలజీ ప్రకారం.. 8.8.8 (అంటే 8వ తేదీ 8వ నెల (ఆగస్టు), 2+0+2+4 (2024)=8) ప్రకారం ఎంగేజ్‌మెంట్ జరిగింది. 8 అంటే అపరిమితం అని అర్ధం. వారి జీవితంలో అపరిమితంగా ఆనందం, అనుబంధాలు, భావోద్వేగాలు కొనసాగుతాయి అని జ్యోతిష్కుడు చెప్పాడు.

శోభితా దూళిపాల గ్రహ సంచారం ప్రకారం.. శాస్త్రం చెప్పిందేమిటంటే.. కేవలం నాగచైతన్యతోనే ప్రేమను పంచుకోవడమే కాకుండా అక్కినేని కుటుంబంతో ఆమె అన్యోన్యంగా ఉంటుంది. అందరిని కలుపుకొని వెళ్లేలా ఆమె చేస్తుంది. దాని వల్ల నాగచైతన్యకు మానసిక ఆనందం కలుగడమే కాకుండా ప్రశాంతమైన జీవితాన్ని లీడ్ చేసేలా చేస్తుంది అని ఉత్తరాదికి చెందిన జ్యోతిష్యుడు పండిట్ జగన్నాథ్ గురూజీ వెల్లడించారు.
కేవలం శోభితా అనుసరించే ప్రవర్తన వల్లే నాగచైతన్య దాంపత్య జీవితం సవ్యంగా సాగుతుంది. వాళ్లిద్దరూ ప్రేమపక్షులుగా లైఫ్‌ను ఆస్వాదిస్తారు. ఒకరికొకరు సమస్యలను, తమ ముందు వచ్చే సవాళ్లను సరిదిద్దుకొనే అవకాశం ఉంది. కాబట్టి వారిద్దరూ తమ కాపురాన్ని ఆస్వాదిస్తారు అని గురూజీ వెల్లడించారు.


Click it and Unblock the Notifications











