సినీ పరిశ్రమలో మరో విషాదం: కరోనాతో టాలెంటెడ్ యాక్టర్ కన్నుమూత

దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని పరిశ్రమల్లో కరోనా వైరస్ చూపిస్తోన్న ప్రభావం అంతా ఇంతా కాదు. గత ఏడాది లాక్‌డౌన్ కారణంగా ఆర్థికంగా నష్టాలను కలిగించిన ఈ వైరస్.. ఈ సారి ఏకంగా చాలా మందిని బలి తీసుకుంటోంది. ఇప్పటికే ఎంతో మంది నటీనటులు, టెక్నీషియన్లు ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలను కోల్పోయారు. మరికొందరు ఈ వైరస్‌కు చిక్కుకుని ప్రాణాల కోసం ఆస్పత్రుల్లో పోరాటం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే తమిళ సినీ పరిశ్రమలో మరో విషాదం జరిగింది. కోవిడ్ కారణంగా ఓ టాలెంటెడ్ యాక్టర్ మరణించారు. ఆయనే నితీష్ వీరా.

ధనూష్ నటించిన 'అసురన్', సూపర్ స్టార్ రజినీకాంత్ 'కాలా' వంటి చిత్రాల్లో అద్భుతమైన పాత్రలను పోషించి బెస్ట్ యాక్టర్‌గా పేరొందిన నితీష్ వీరా కరోనాతో మృతి చెందారు. కొన్ని రోజుల క్రితం ఈ వైరస్ బారిన పడిన ఆయన.. అప్పటి నుంచి చెన్నైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో సోమవారం తెల్లవారుజామున ఆయన పరిస్థితి బాగా విషమించింది. దీంతో ఆయన హాస్పిటల్‌లోనే ప్రాణాలను విడిచారు. ఆయన మరణంపై కోలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులంతా సంతాపం తెలుపుతున్నారు. నితీష్ వీరా కుటుంబానికి ప్రగాఢ సానూభూతిని తెలియజేస్తున్నారు.

 Asuran Fame Nitish Veera Passes Away

2006లో సెల్వ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన 'పుదుపెట్టై' అనే సినిమాతో నటుడిగా ఆరంగేట్రం చేశారు నితీష్ వీరా. మొదటి చిత్రంలోనే అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఆయన.. విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నారు. అదే సమయంలో వరుసగా ఆఫర్లను సైతం అందుకున్నారు. సుదీర్ఘమైన కెరీర్‌లో నితీష్ వీరా 'సింధనాయి సేయి', 'వెన్నిల కబడ్డీ కుజు', 'కాలా', 'అసురన్' సహా ఎన్నో చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలు పోషించారు. ఇక, ఇప్పుడు విజయ్ సేతుపతి కొత్త చిత్రం 'లాభం'లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X