Athadu 4K: అతడు రీ రిలీజ్ రికార్డు.. విడుదలకు ముందే మహేష్ మూవీ సంచలనం!
సూపర్‌స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం అతడు. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ జయభేరి ఆర్ట్స్ బ్యానర్‌పై దుగ్గిరాల కిషోర్, ఎం రామ్మోహన్ ఈ సినిమాను భారీగా నిర్మించారు. ఈ చిత్రంలో త్రిషా కృష్ణన్, సోనుసూద్, ప్రకాశ్ రాజ్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ధర్మవరం సుబ్రమణ్యం, హేమ, సుధ తదితరులు నటించారు. 2005 సంవత్సరం ఆగస్టు 10వ తేదీన రిలీజైన ఈ సినిమా మరోసారి లేటేస్ట్ టెక్నాలజీ హంగులతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నది. ఈ సినిమా 4K రిలీజ్ వివరాల్లోకి వెళితే..
అతడు సినిమా ఏపీ, యూఏస్ఏలో గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఆ సమయంలో యావరేజ్ టాక్ సంపాదించుకొన్నది. అయితే ఆ ఏడాది అత్యధిక గ్రాస్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అంతేకాకుండా మహేష్ బాబుకు ఓవర్సీస్ మార్కెట్‌ను ఓపెన్ చేయడమే కాకుండా అక్కడ తెలుగు సినిమా బాక్సాఫీస్‌కు బాటలు వేసింది. అతడు సినిమా తర్వాత మహేష్ బాబుకు ఓవర్సీస్ మార్కెట్‌లో భారీ అంచనాలు పెరిగాయి.

అతడు చిత్రం అమెరికాలో 2.6 మిలియర్ డాలర్లు వసూలు చేసింది. ఈ సినిమా 205 సెంటర్లలో 50 రోజులు, 38 సెంటర్లలో 100 రోజులు ఆడింది. హైదరాబాద్ సుదర్శన్ థియేటర్‌లో 175 రోజులు ఆడి 1.5 కోట్ల వసూళ్లను సాధించింది. ఈ సినిమా మొత్తంగా 22 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాల రిపోర్ట్.
అతడు సినిమా విశేషాలకు వెళితే.. ఇప్పటి వరకు టెలివిజన్‌లో అత్యధిక సార్లు టెలికాస్ట్ అయిన సినిమాగా రికార్డు సంపాదించుకొన్నది. అతడు మూవీ ఇప్పటికీ ఎన్నోసార్లు ప్రసారమై ప్రేక్షకులను కొత్త అనుభూతిని పంచింది. ఇప్పటికీ ఆ సినిమా వస్తే.. చాలా మంది టీవీలకు హత్తుకుపోయి చూస్తారంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఈ సినిమా కలెక్షన్లే కాదు.. మూడు నంది అవార్డులను గెలుచుకొన్నది. ఉత్తమ మాటల రచయితగా త్రివిక్రమ్ శ్రీనివాస్, ఉత్తమ నటుడిగా మహేష్ బాబు, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో సీహెచ్ శ్రీనివాస్ నంది అవార్డులు గెలుచుకొన్నారు.
ఇలాంటి విశేషాలు, ప్రత్యేకతలు, రికార్డులు, అవార్డులు గెలుచుకొన్న అతడు సినిమాను నేటి ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా లేటేస్ట్ టెక్నాలజీతో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమాను 4k, ఐమాక్స్, డాల్బీ, సూపర్ 4K ఫార్మాట్స్‌లో రిలీజ్ చేయనున్నారు. ఒరిజినల్ సౌండ్ ట్రాక్ టెక్నాలజీతో రీ రిలీజ్ చేసేందుకు సిద్దం చేస్తున్నారు. అంతేకాకుండా ఐమాక్స్ డాల్బీ సౌండ్ సూపర్ 4K రిలీజ్ అవుతున్న తొలి చిత్రంగా రికార్డు క్రియేట్ చేయబోతున్నది. ఈ సినిమాను ఆగస్టు 9వ తేదీన రిలీజ్ చేసేందుకు రెడీ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











