ఆత్రేయపురం ఆణిముత్యం... షకలక శంకర్ హీరోగా మరో మూవీ!

జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అవ్వడం ద్వారా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని మంచి కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న షకలక శంకర్ ఇపుడు హీరోగా మారి హాస్య ప్రధానమైన చిత్రాలు చేస్తూ దూసుకెళుతున్నాడు. తాజాగా శంకర్ హీరోగా మరో చిత్రం మొదలైంది.

షకలక శంకర్, రీతూ భర్మెచా హీరో హీరోయిన్లుగా ది వన్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై ఎం.యస్. రెడ్డి నిర్మిస్తూ, దర్శకత్వం వ‌హిస్తోన్న చిత్రం 'ఆత్రేయపురం ఆణిముత్యం'. ఈ మూవీ పూజా కార్ర్యక్రమాలతో రామానాయుడు స్టూడియోలో ఆదివారం మొదలైంది. ప్ర‌ముఖ నిర్మాత కె.ఎల్ దామోదర్ ప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరైన క్లాప్ కొట్టగా, సీనియర్ డైరెక్టర్ సాగర్ గౌరవ దర్శకత్వం వ‌హించారు. పి. సత్యా రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

Athrayapuram Animuthayam Movie Starts

సినిమా గురించి షకలక శంకర్ మాట్లాడుతూ..."ఆత్రేయపురం ఆణిముత్యం నా మార్క్ కామెడీ చిత్రం. ఎమ్మెస్ రెడ్డిగారు మంచి క‌థ‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సినిమాలో మంచి వినోదం ఉంటుంది అన్నారు. చిత్ర ద‌ర్శ‌క నిర్మాత ఎం.యస్. రెడ్డి మాట్లాడుతూ... ఆత్రేయపురంలో రాజు అనే యువకుడి చుట్టూ తిరిగే కుటుంబ హాస్య చిత్రం ఇది. సమాజంలో మహిళలపై జరిగే వేధింపుల గురించి ఈ సినిమా ఉంటుందన్నారు.

తారాగణం : షకలక శంకర్, రీతూ భర్మెచా, ఇంద్రజ, తులసి, కాశీ విశ్వనాథ్, డిఎస్ రావు, ప్రసాద్, పటాస్ నూకరాజు, మహిపాల్

ఎడిటర్ - మార్తాండ్ కె వెంకటేష్
డిఓపీ- రవి
మ్యూజిక్ - వెంగి
స్టిల్స్ - శ్రీను విల్లా
ఆర్ట్ - వర్మ
పబ్లిసిటీ డిజైనర్- వివా రెడ్డి
నిర్మాత, దర్శ‌కుడు- ఎం.య‌స్‌.రెడ్డి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X