AA22xA6: ‘ఇది రిస్క్ కాదు.. రివల్యూషన్’: అల్లు అర్జున్ మూవీపై అట్లీ హైప్..
Allu Arjun-Atlee: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)- సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అట్లీ (Atlee) కాంబోలో భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై టాలీవుడ్‌లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమా తాత్కాలికంగా 'AA 22' పేరుతో పిలుస్తున్నారు. విడుదలైన ప్రివిజువలైజేషన్ వీడియోతోనే ఈ సినిమా రేంజ్ ఏంటో అర్థమైపోయింది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనేలా డైరెక్టర్ అట్లీ ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఇంతకీ ఏమన్నారంటే?
ఇటీవల బెంగళూరు లో జరిగిన పికిల్‌బాల్ టోర్నమెంట్‌లో డైరెక్టర్ అట్లీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అల్లు అర్జున్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. "ఏ పని అయినా ఒక ఆలోచనతోనే ప్రారంభమవుతుంది. ఈ సినిమాతో ప్రేక్షకులకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయాలని నిర్ణయించుకున్నాం. ఇది సాధారణ సినిమా కాదు, ఆడియన్స్ ఆశ్చర్యపోయేలా కొత్త అనుభూతి ఇవ్వబోతున్నాం. హాలీవుడ్ స్థాయిలో టెక్నీషియన్లు పని చేస్తున్నారు. వారు కూడా ఈ సినిమాను తమ కెరీర్‌లో అత్యంత సవాలుగా తీసుకున్నారు" అని అట్లీ తెలిపారు.

ఈ ప్రాజెక్ట్‌ను 700 నుంచి 800 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారని సమాచారం. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ కొరియోగ్రఫీ, సౌండ్ డిజైన్‌తో ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని అనుభూతి పొందబోతున్నారు. ఇంతకీ భారీ బడ్జెట్ తో సినిమా తీసున్నారు. రిస్క్ అని భావిస్తున్నారా? అని ప్రశ్నించగా.. ' ఇందులో ఎలాంటి రిస్క్ లేదు. రివల్యూషన్.. ఇంతవరకు ఇండియన్ సినిమాలో చూపించని స్కేల్‌లో ఈ కథను రూపొందిస్తున్నాం. మేము తీసుకునే ప్రతి ఫ్రేమ్‌లో కొత్తదనం ఉంటుంది. ఇది సాధారణ సినిమా కాదు.. ప్రేక్షకులకు ఓ ప్రపంచంలోకి తీసుకెళ్తాం..'అని అట్లీ అన్నారు.
అల్లు అర్జున్ లుక్ గురించి ప్రశ్నించగా ఆయన నవ్వుతూ, "ఇంకొన్ని నెలలు ఎదురు చూడండి. బన్నీ లుక్ చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఆయన ట్రాన్స్‌ఫర్మేషన్ వేరే లెవల్‌లో ఉంటుంది," అంటూ సినిమాపై ఆసక్తిని మరింత పెంచారు. అనంతరం డైరెక్టర్ అట్లీ తన కెరీర్ జర్నీపై మాట్లాడుతూ, "'రాజారాణి', 'తెరి', 'మెర్సల్', 'బిగిల్', 'జవాన్' సినిమాల ద్వారా ప్రేక్షకులు చూపిన ప్రేమే ఈ భారీ ప్రాజెక్ట్‌ను చేయడానికి ధైర్యం ఇచ్చింది. దేవుడు మా ప్రయాణంలో ప్రతి అడుగులోనూ తోడుగా ఉన్నాడు. నేను ఈ ప్రాసెస్‌ని పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నా," అని అట్లీ ర్కొన్నారు.
అల్లు అర్జున్ - అట్లీ కాంబోలో వస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ వర్క్ దాదాపుగా ముగిసింది, షూటింగ్ త్వరలో ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. అన్ని విభాగాల్లో అత్యున్నత నిపుణులు పాల్గొంటున్న ఈ ప్రాజెక్ట్ విడుదలయ్యే సమయానికి ఇండియన్ సినిమా స్థాయిని మరోసారి ప్రపంచానికి చూపిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
అదే సమయంలో అట్లీ 'కాంతార చాప్టర్ 1' గురించి మాట్లాడారు. ఆ సినిమా పట్ల తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. "నేను విదేశాల్లో ఉన్నప్పుడు 'కాంతార 1' మొదటి రోజే చూడటానికి రెండు గంటలు డ్రైవ్ చేశా. సినిమా చూసాక వెంటనే రిషబ్ శెట్టి కి కాల్ చేసి అభినందించా. నేను చాలా గౌరవించే దర్శకుల్లో రిషబ్ ఒకరు. ఆయన కృషి నిజంగా స్ఫూర్తిదాయకం. ఆయన ఈ సినిమాతో మరో నేషనల్ అవార్డు గెలవాలని కోరుకుంటున్నా," అని అట్లీ అన్నారు.


Click it and Unblock the Notifications











