ఎన్టీఆర్ అంటే ఇష్టం.. ఆయన లేకుంటే నేను లేను.. అట్లీ సెన్సేషనల్ కామెంట్స్
రాజా రాణి సినిమాతో కోలీవుడ్, టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు అట్లీ. ఈ ఒక్క సినిమాతో అందర్నీ ఆకర్షించాడు. సినిమాలోని కథ, కథనం అన్నీ కొత్తగా ఉండటం.. ఒకేసారి రెండు భిన్న ప్రేమకథలను చూపించడం, ఎక్కడా ఎంటర్టైన్మెంట్ మిస్ కాకుండా తెరకెక్కిండటంతో ఆ చిత్రం ఘన విజయం సాధించింది.

సోషల్ మెసెజ్‌తో పాటు కమర్షియల్..
సామాజిక సందేశాలను ఇవ్వడమే కాదు.. అందరూ మెచ్చే విధంగాను తెరకెక్కించడంలో అట్లీ దిట్ట. తేరి, మెర్సెల్ అంటూ ఇళయ దళపతి విజయ్‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టేశాడు. మెర్సెల్ ఏకంగా జాతీయ స్థాయిలో ట్రెండ్ అయింది. జీఎస్టీని ఎత్తి చూపుతూ తీసిన ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసింది.

తాజాగా విజిల్ వేసేందుకు రెడీ...
ఫుట్‌బాల్ కథా నేపథ్యంలో విజయ్ హీరోగా తెరెకెక్కిన విజిల్ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసేందుకు సిద్దమయ్యారు. విజయ్‌తో హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు అట్లీ రెడీ అయ్యాడు. ఇప్పటికే ట్రైలర్‌తో అంచనాలు పెంచేసిన చిత్రయూనిట్ దీపావళికి స్పెషల్ ట్రీట్ ఇచ్చేందుకు థియేటర్‌కు వచ్చేస్తోంది.
ఎన్టీఆర్ అంటే ఇష్టం..
నా చిత్రం నుంచి ఏ చిన్న టీజర్ వచ్చినా ఎన్టీఆర్ నుంచి ఫోన్ వస్తుంది.. అంతలా ప్రేమ చూపిస్తాడు.. ఆయనంటే నాకు ఇష్టం.. అంటూ ఎన్టీఆర్ గురించి చెప్పుకొచ్చాడు.

విజయ్ లేకపోతే నేను లేను..
నేను ఈ రోజు ఈ స్టేజ్‌లో ఉన్నానంటే దానికి కారణం విజయ్ అన్నా.. ఆయన లేకపోతే నేను లేను.. నేను ఇంత ఎత్తుకు ఎదిగానంటే అది ఆయన వల్లే.. అంటూ విజయ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.


Click it and Unblock the Notifications











