నా స్థానంలో మరొకరుంటే సూసైడ్ చేసుకొనే వారేమో.. ట్రోలింగ్‌పై యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్.. తెలంగాణకు యువ హీరో

బుల్లితెర మెగాస్టార్ ఈటీవీ ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమవుతూ నటించిన చిత్రం రామ్ నగర్ బన్నీ. సినిమా రంగానికి పరిచయమైన ఈవెంట్‌లో ఆయన మాట్లాడిన తీరుతో చంద్రహాస్‌కు యాటిట్యూడ్ స్టార్ అనే ట్యాగ్ లభించింది. విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమాకు శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్‌కు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

స్పీకర్ ప్రసాద్ కుమార్ చేతుల మీదుగా గ్లింప్స్, ఫస్ట్ లుక్ రిలీజ్ తర్వాత హీరో చంద్ర హాస్ ఇటీవల తుఫాన్, వరద భీభత్సంతో తల్లడిల్తుతున్న బాధితులకు తన వంతు సహాయంగా ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇప్పటి వరకు నేను నా తల్లిదండ్రుల సంపాదనపై ఆధారపడి ఉన్నాను. ఈ సినిమా ద్వారా కొంచెం సంపాదించాను. అందులో నుంచి కొంత సహాయం చేయాలని నిర్ణయించుకొన్నాను అని అన్నారు.

Attitude Star Chandra Hass s Ram Nagar Bunny Movie Firs look Release by Telangana Assembly Speaker Gaddam Prasad Kumar

ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభాకర్ నాకు సుపరిచితులు. ఆయన రామ్ నగర్ బన్నీ సినిమా గురించి చెప్పి నన్ను ఈ వేడుకకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. చంద్రహాస్ మా అమ్మాయి క్లాస్ మేట్. తెలంగాణలో వరద బాధితులను ఆదుకునేందుకు చంద్రహాస్ తన వంతు సహాయాన్ని అందించడం సంతోషంగా ఉంది. మొదటి సినిమాకు హీరోలు అంతగా ఆకట్టుకోరు. కానీ చంద్రహాస్ బాగున్నాడు. ఫస్ట్ లుక్, గ్లింప్స్‌తో ఆకట్టుకున్నాడు. అతన్ని రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నా. అలాగే కుటుంబ సభ్యులు ఆయన ఎలా ఎదగాలని కోరుకుంటున్నారో ఆ స్థాయికి చంద్రహాస్ చేరుకోవాలని నా ఆశీస్సులు అందిస్తున్నా అని అన్నారు.

Attitude Star Chandra Hass s Ram Nagar Bunny Movie Firs look Release by Telangana Assembly Speaker Gaddam Prasad Kumar

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ మాట్లాడుతూ .. రెండేళ్ల క్రితం నా ఫస్ట్ ప్రెస్ మీట్‌లో నాకు ఏమీ అర్ధం కాలేదు. నా తండ్రి నా గురించి పొగుతుంటే నాకు ఏం చేయాలో అర్ధం కాలేదు. చేతులు జేబులో పెట్టుకొని ఓ రకమైన ఫీలింగ్‌కు గురయ్యాను. దాన్ని చూసి సోషల్ మీడియాలో నన్ను బాగా ట్రోల్ చేశారు. అయితే నా మొదటి సినిమా కాకుండానే నాపై నెగిటివ్‌గా స్పందించడాన్ని నేను పాజిటివ్‌గా తీసుకొన్నాను. నా స్థానంలో మరొకరు ఉంటే సూసైడ్ చేసుకొనే వారేమో.. నా స్నేహితులు కూడా అదే మాట అన్నారు అని తెలిపారు.

Attitude Star Chandra Hass s Ram Nagar Bunny Movie Firs look Release by Telangana Assembly Speaker Gaddam Prasad Kumar

నేను సినిమాల్లో ఒకలా, బయట మరొకలా బిహేవ్ చేయను. నా మనసులో ఏముందో అదే మాట్లాడుతుంటా. అది కొందరికి నచ్చలేదు. ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయాలనే కోరికతో హీరోగా మారాను. అందుకు మా అమ్మా నాన్నలు ఎంతో సపోర్ట్ చేశారు. మా నాన్న ప్రభాకర్ పేరు నిలబెట్టేలా కష్టపడతాను. నా ప్రతిభను నా సినిమాల రిజల్ట్ ద్వారానే తెలియజేయాలని భావిస్తున్నా. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నా. వాటిలో ఫస్ట్ మూవీగా రామ్ నగర్ బన్నీ అక్టోబర్‌లో మీ ముందుకు రాబోతోంది అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X