Ramarao On Duty సినిమాలో పవిత్ర, నరేష్‌.. థియేటర్లో గోల గోల.. ఎలా కనిపించారంటే?

ప్రముఖ నటి పవిత్ర లోకేష్ - సీనియర్ నటుడు VK నరేష్ ఇటీవల వివిధ రకాల వార్తలతో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఇద్దరు ప్రేమలో ఉన్నారని అలాగే త్వరలో పెళ్లి చేసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని అనేక రకాల ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో పవిత్రకు నటిగా అవకాశాలు తగ్గినట్లు ఇండస్ట్రీలో మరొక టాక్ కూడా వినిపించింది. అయితే ఈ ఇద్దరు యాక్టర్స్ కూడా రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో నటించారు. నేడు ఆ సినిమా విడుదల కాగా వారి పాత్రలు రాగానే థియేటర్స్ లో ఆడియెన్స్ గోల గోల చేశారు. ఇక వారు ఎలాంటి పాత్రల్లో కనిపించారు అనే వివరాల్లోకి వెళితే..

ఊహించని వివాదం

ఊహించని వివాదం

ఒకప్పుడు సినిమాల్లో ప్రధాన పాత్రలో కనిపించి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిన పవిత్ర లోకేష్, వికె నరేష్ ఇద్దరు కూడా ప్రేమలో ఉన్నట్లు గతంలోనే చాలా రకాల కథనాలు వచ్చాయి. అయితే ఆ వార్తలు వైరల్ అవుతున్న సమయంలోనే నరేష్ మూడో భార్య కూడా ఊహించిన విధంగా వారిపై ఆరోపణలు చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. వారిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు ఆమె మీడియా ముందు వివరణ ఇచ్చింది.

హోటల్ లో అలా..

హోటల్ లో అలా..

పవిత్ర లోకేష్ నరేష్ ఇద్దరు కూడా ఒక హోటల్లో కూడా కలిసి ఉన్నట్లు నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ప్రత్యేకంగా మీడియాతో వెళ్లి రేడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇక ఆ విషయంపై ఆమె అక్కడే అనేక రకాల ప్రశ్నలు కూడా వేయడం జరిగింది. ఇక నరేష్ మాత్రం ఆమెకు ఎలాంటి సమాధానం చెప్పకుండా పవిత్రతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ వివాదంతో వీరిపై మళ్ళీ ఒక్కసారిగా వార్తలు వైరల్ అయ్యాయి.

పవిత్ర వీడియో వైరల్

పవిత్ర వీడియో వైరల్


మరోవైపు పవిత్ర మాత్రం తమ ఇద్దరి మధ్యలో ఎలాంటి సంబంధం లేదు అని కాకపోతే సినిమా ఇండస్ట్రీలో మంచి నటులుగా ఒక మంచి స్నేహంతోనే ఉంటున్నట్లుగా వివరణ ఇచ్చారు. అయితే ఈ విషయంలో ఎవరి మాటలు నమ్మవద్దు అని ప్రజల పూర్తి మద్దతుతో తమకు కావాలి అని కూడా పవిత్ర లోకేష్ ఒక వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే.

 తల్లి పాత్రలతో

తల్లి పాత్రలతో

అయితే పవిత్ర లోకేష్ నరేష్ వివాదం తర్వాత వారికి కొన్ని అవకాశాలు ఇండస్ట్రీలో తగ్గినట్లుగా ఒక టాక్ అయితే వినిపించింది. ముఖ్యంగా పవిత్ర లోకేష్ అంతకుముందు వరకు కూడా ఓ వర్గం హీరోలకి తల్లి పాత్రలలో కనిపించిన విషయం తెలిసిందే. ఆమె తెలుగు చిత్ర పరిశ్రమంలో ప్రస్తుతం ఉన్న యంగ్ స్టార్ హీరోలు అందరికీ కూడా తల్లి పాత్రల్లో కనిపించింది.

తగ్గిన సినిమా అవకాశాలు

తగ్గిన సినిమా అవకాశాలు

ఇక నరేష్ వివాదం అనంతరం పవిత్ర లోకేష్ కు ఇండస్ట్రీలో అవకాశాలు చాలా వరకు తగ్గినట్లు టాక్ వచ్చింది. ముఖ్యంగా హీరోలు ఆమెను తల్లి పాత్రలలో సెలెక్ట్ చేసుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు అని మీడియాలో కథనాలు కూడా వెలువడ్డాయి. ఒక ఇద్దరు హీరోలు కూడా కొన్ని రోజులు షూటింగ్ చేసిన అనంతరం మళ్లీ పవిత్ర లోకేష్ తీసేసి మరొకరిని సెలెక్ట్ చేసుకున్నట్లు కూడా ఒక టాక్ అయితే వచ్చింది. కానీ ఇంతవరకు ఆ విషయంలో ఎవరూ పెద్దగా క్లారిటీ ఇవ్వలేదు.

రామారావు సినిమాలో

రామారావు సినిమాలో

ఇక వివాదం అనంతరం పవిత్ర లోకేష్ రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో కనిపించడం విశేషం. నరేష్ వివాదం జరగక ముందే పవిత్ర లోకేష్ ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసింది. ఇక ఆమె ఈ సినిమాలో రవితేజకు తల్లి పాత్రలో కనిపించడం జరిగింది. ఇక ఆమెకు సంబంధించిన పాత్రను ట్రైలర్లో అలాగే పోస్టర్లలో కూడా చూపించింది లేదు. ఇక సినిమాలో అయితే ఆమె కేవలం కొన్ని సన్నివేశాల్లోనే రొటీన్ గానే యాక్ట్ చేసినట్లు కామెంట్స్ వస్తున్నాయి.

నరేష్, పవిత్ర.. థియేటర్స్ లో గోల

నరేష్, పవిత్ర.. థియేటర్స్ లో గోల


పవిత్ర లోకేష్ హీరో రవితేజ పాత్రపు తల్లిగా నటించగా మరోవైపు నరేష్ హీరోయిన్ పాత్రకు తండ్రిగా నటించాడు. ఊహించని విధంగా వీరి రెండు పాత్రలు సినిమాలో హైలైట్ అయ్యాయి. ఇక వీరి క్యారెక్టర్స్ రాగానే థియేటర్లో జనాలు గోల గోలగా విజిల్స్ వేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు కూడా కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X