కవచం ఆడియో విడుదలకు ముహూర్తం ఖరారు!
యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న తాజా చిత్రం కవచం. ఈ చిత్రంలో శ్రీనివాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. కాజల్ అగర్వాల్, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీనివాస్ మామిళ్ళ దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. డిసెంబర్ 7 న కవచం విడుదుల కాబోతుండగా కొద్దిరోజుల ముందు ఆడియో విడుదుల కానుండడం విశేషం.
డిసెంబర్ 2న భీమవరంలో గ్రాండ్ గా ఆడియో లాంచ్ వేడుక నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మంచి కమర్షియల్ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. ఇప్పటికే హీరోయిన్లతో ఉండే కొన్ని పోస్టర్స్ వైరల్ అవుతున్నాయి. శ్రీనివాస్ తో కాజల్, మెహ్రీన్ రొమాంటిక్ లుక్ లో ఆకట్టుకుంటున్నారు.

బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ లో మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. శ్రీనివాస్ నటిస్తున్న అన్ని చిత్రాలలో నటన, డాన్సులు, పోరాట సన్నివేశాలతో ఆకట్టుకుంటున్నాడు. కానీ కమర్షియల్ గా విజయం సాధించడం లేదు. కవచం చిత్రం ఆ లోటుని భర్తీ చేస్తుందని శ్రీనివాస్ ధీమాగా ఉన్నాడు. మరో వైపు తేజ దర్శత్వంలో కూడా బెల్లంకొండ నటించనుండడం విశేషం.


Click it and Unblock the Notifications











