twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆస్ట్రేలియాలో 2.0 చిత్రాన్ని అలా వాడేస్తున్న పోలీసులు!

    |

    సూపర్ స్టార్ రజనీకాంత్, దిగ్గజ దర్శకుడు శంకర్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కాంబినేషన్ లో వచ్చిన అత్యంత భారీ బడ్జెట్ చిత్రం 2.0. భారత సినిమా చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో 600 కోట్ల బడ్జెట్ తో రూపొందిన చిత్రం ఇది. ఇండియన్ సినిమాకు గర్వకారణం అంటూ కూడా ప్రశంసలు వచ్చాయి. కానీ 2.0 చిత్రం రజినీకాంత్, శంకర్ సినిమాలు స్థాయిలో ఆడలేకపోయింది. అమీ జాక్సన్ ఈ చిత్రంలో లేడి రోబోగా నటించింది.

    ఈ చిత్రంలో సన్నివేశాన్ని ఆస్ట్రేలియా పోలీసులు తెగ వాడేస్తున్నారు. మనిషి రక్తంలో బీఏసీ శాతం 0.341 ఆల్కహాల్ గా 2.0 చిత్రంలో నమోదవుతుంది. దాని ప్రకారం ఆ వ్యక్తి కోమాలో లేదా అప్పుడే శస్త్ర చికిత్స చేయించుకున్న వ్యక్తితో సమానం అనే సన్నివేశం 2.0 లో ఉంది. ఈ సన్నివేశాలు ఆస్ట్రేలియా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడే వ్యక్తులకు చూపిస్తూ చైతన్య పరుస్తున్నారు.

    Australian cops use Rajinikanths 2.0 meme to talk drunk driving

    ఆస్ట్రేలియాలోని డెర్బి అనే నగర పోలికలు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అరికట్టేందుకు ఈ తరహా క్యాంపైనింగ్ మొదలు పెట్టారు. 2.0 చిత్రంలో రజని ఫోటోని కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. రజనీకాంత్ కు దేశవిదేశాల్లో క్రేజ్ ఉంది. ఇప్పుడు 2.0 చిత్రం కూడా ఆస్ట్రేలియాలో క్రేజీగా మారడంతో రజని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.

    English summary
    Australian cops use Rajinikanth's 2.0 meme to talk drunk driving
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X