టాలీవుడ్‌లో అడుగుపెట్టనున్న డేవిడ్ వార్నర్.. ఆ హీరోతోనే ఫస్ట్ సినిమా!
ఇండియాలో సినిమాకు , క్రికెట్‌కు ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతో మంది క్రికెటర్లు హీరోయిన్లతో ఎఫైర్లు సాగించగా.. కొందరు పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు. కొందరు క్రికెటర్ల జీవితాలు వెండితెరపై బయోపిక్స్‌గానూ వచ్చాయి. సచిన్, కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీ వంటి దిగ్గజ క్రికెటర్లు వెండితెరపై అలరించాయి. త్వరలోనే టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బయోపిక్ కూడా పట్టాలెక్కనుంది. ఈ విషయాన్ని స్వయంగా దాదా అనౌన్స్ చేశారు.
క్రికెటర్ల జీవితాలు సినిమాలుగా రావడమే కాకుండా పలువురు క్రికెటర్లు కొన్ని సినిమాలలోనూ నటించారు . అజయ్ జడేజా, వినోద్ కాంబ్లీ, సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్, సునీల్ అంకోలా, యువరాజ్ సింగ్, శ్రీశాంత్, సునీల్ గావస్కర్ తదితరులు సినిమాలో గెస్ట్ రోల్స్‌లో నటించారు. తాజాగా మరో క్రికెటర్ వెండితెరపై అడుగుపెట్టనున్నారు. అది కూడా మన తెలుగు సినిమాతో కావడం విశేషం. ఆయన మన టీమిండియా ప్రస్తుత, మాజీ క్రికెటర్ కాదు. అసలు మనదేశానికే చెందిన వ్యక్తి కాదు. ఆయనే ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్.

డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆస్ట్రేలియాలో స్టార్ క్రికెటర్‌గా ఒంటి చెత్తో మ్యాచ్ ఫలితాలను తారుమారు చేయగల సత్తా ఆయన సొంతం. అయితే డేవిడ్ వార్నర్‌కు భారతదేశమన్నా, భారతీయులన్నా ఎంతో గౌరవం, అభిమానం. తన దేశం తర్వాత ఇండియాను ఆయన ఎంతో ఇష్టపడతారు. ఇక ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా ఆయనకు ఈ దేశంతో మరింత అనుబంధం పెరిగిపోయింది. సన్‌రైజర్స్ ఆటగాడిగా డేవిడ్ వార్నర్ తెలుగువారికి బంధువుగా మారిపోయారు.
డేవిడ్ వార్నర్‌లో క్రికెటర్ మాత్రమే కాకుండా చాలా కళలు ఉన్నాయి. అదే రీల్స్ చేయడం. కరోనా సమయంలో తెలుగు సినిమా పాటలు ముఖ్యంగా పుష్పలోని పుష్ప రాజ్ రోల్‌తో ఆయన చేసిన రీల్స్ బాగా వైరల్ అయ్యాయి. టిక్ టాక్, డబ్ స్మాష్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన చేసిన రీల్స్ బాగా ట్రెండ్ అయ్యాయి. అలాగే తన ఫేస్‌కు హీరోల ముఖాన్ని జోడించి రీల్స్ చేసి మరింత అలరించారు. టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ - డేవిడ్ వార్నర్ మధ్య మంచి అనుబంధం కూడా ఉంది. ఇటీవల అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అతనికి శుభాకాంక్షలు కూడా తెలియజేశారు.
1st day ye mathram miss avvanu ee Movie ki 💥🤣😂 Devid mama acting ela untadho chudali 🙂🤣
— Praveen K (@PK4NTR) March 4, 2025
Eagerly waiting for the movie 🎥🔥
Nithiin - David Warner
What a combination 🙌 pic.twitter.com/ESos5j55I4
ఆయన తెలుగు సినిమాలలో గెస్ట్ రోల్ చేస్తే బాగుంటుందని అప్పట్లో నెటిజన్లు తెగ కామెంట్స్ పెట్టారు. ఇప్పుడు ఈ కలను నిజం చేస్తూ డేవిడ్ వార్నర్ సినిమాల్లోకి ప్రవేశించనున్నారు. అది కూడా మన తెలుగు సినిమాలోనే కావడం గమనార్హం. నితిన్ హీరోగా నటిస్తున్న రాబిన్ హుడ్‌లో డేవిడ్ వార్నర్ కీలకపాత్ర పోషించనున్నారట. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాత రవిశంకర్ అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. కింగ్‌స్టన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన ఈ విషయం తెలియజేశారు. దీంతో డేవిడ్ వార్నర్ ఏ రోల్‌లో నటించనున్నారు? ఆయన పాత్ర ఎలా ఉండనుంది? అంటు క్రికెట్, సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











