Silk Smitha Biopic: సిల్క్ స్మితా బయోపిక్.. ఛాన్సు కొట్టేసిన ఆస్ట్రేలియన్ హాట్ బ్యూటీ.. ఎవరో తెలుసా?
సిల్క్ స్మిత.. ఈ పేరు వింటే చాలు కుర్రకారు గుండెల్లో హీటు మొదలవుతుంది. ఇక ఆమె చేసిన సినిమాలు, పాత్రలు గుర్తుకు వస్తే వారి పరిస్థితి ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన నటనతో అంతకు మించిన గ్లామర్ షో చేసిన ఈ ముద్దుగుమ్మ పాతికేళ్ల క్రితమే ప్రాణాలు కోల్పోయింది. అయినప్పటికీ.. కుర్రకారు కలల రాణి అయిన ఈమె ఇప్పటికీ వారి హృదయాల్లో సజీవంగానే ఉంది. ఆమెను, ఆమె అందాలను, ఆమె చేసిన పాత్రలను మర్చిపోవడం ఎవరి తరమూ కాదు. అయితే ఈరోజు సిల్క్ స్మిత జయంతి. 63వ పుట్టిన రోజు సందర్భంగా ఆమె బయోపిక్ ను తీసుకు రాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
ముఖ్యంగా డైరెక్టర్ జయరాం.. సిల్క్ స్మిత బయోపిక్ ను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి జయరాం దర్శకత్వం వహిస్తుండగా... వి మహాస్త్రి అమృత రాజ్ సమర్పణలో స్త్రీ సినిమాని నిర్మిస్తున్నారు. ఎస్ బి విజయ్ ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ గా వ్యవహరించబోతున్నారు. అయితే తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని తీసుకు రాబోతున్నట్లు కూడా వెల్లడించారు. ఇదంతా ఇలా ఉండగా.. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా ఈరోజే విడుదల చేశారు.

అందులో ఉన్న హీరోయిన్ అచ్చం సిల్క్ స్మితలాగే కనిపిస్తోంది. అచ్చం ఆమెలాగే కనిపిస్తున్న ఈ హాట్ బ్యూటీ మరెవరో కాదు చంద్రికా రవి. భారత సంతతికి చెందిన ఈ ముద్దుగుమ్మ ఆస్ర్టేలియన్ హీరోయిన్. మోడల్ గా, హీరోయిన్ గా అద్భుతమైన చిత్రాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా చీకటి గదిలో చితక్కొట్టుడు చిత్రంలో కనిపించిన ఈమె సిల్క్ స్మిత పాత్రలో మెరవబోతుంది. వీర సింహారెడ్డి చిత్రంలో నందమూరి బాలకృష్ణ సరసన మా బావ మనోభావాలు దెబ్బితిన్నాయి పాటకు అద్భుతంగా స్టెప్పులు వేసింది.

ఈ హాట్ బ్యూటీయే ఇప్పుడు సిల్క్ స్మితగా కనిపించి అందరినీ మెస్మరైజ్ చేసేందుకు రాబోతుంది. అయితే ఇప్పటికే ద డర్టీ పిక్చర్ సినిమా పేరిట సిల్క్ స్మిత జీవితాన్ని పూర్తిగా చూపించేశారు. అయితే అప్పుడు సిల్క్ స్మిత పాత్రలో విద్యా బాలన్ నటించగా.. విపరీతమైన స్పందన వచ్చింది. అచ్చం ఆమెలాగే విద్యా బాలన్ కనిపించడం, ఆమె జీవితం మొత్తం చూపించడంతో అంతా ఫిదా అయిపోయారు. మరి మరోసారి రాబోతున్న సిల్క్ స్మిత బయోపిక్ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో... ముఖ్యంగా చంద్రికా రవి ఏ మేర ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.



Click it and Unblock the Notifications











