ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆశీస్సులతో ఆటో రజని.. హీరో ఎవరంటే..
JSR మూవీస్ పతాకం పై బి.లింగుస్వామి సమర్పణ లో జొన్నలగడ్డ శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం "ఆటో రజని" ప్రేమెంత పనిచేసే నారాయణ సినిమాతో తన డాన్స్‌లతో, యాక్టింగ్‌తో మంచి పేరు తెచ్చుకున్న జొన్నలగడ్డ హరికృష్ణ హీరోగా తెరకెక్కుతున్న పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ "ఆటో రజని".
జొన్నలగడ్డ హరిక్రిష్ణ రెండవ సినిమా గా వస్తున్న ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు అందించారు ..ఆయన ఎంతో బిజీ గా ఉండి కూడా ఇండస్ట్రీలో కి కొత్తగా వచ్చిన మా హీరోకి ఆయన బ్లెస్సింగ్స్ ఉండటం ఆనందంగా ఉంది అన్నారు దర్శకులు జొన్నలగడ్డ శ్రీనివాస్. తాడేపల్లి లోని వైస్సార్సీపీ కార్యాలయంలో ఏపీ సీఎం వైస్ జగన్‌ను కలిసి జొన్నలగడ్డ హరికృష్ణ దీవెనలు అందుకొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు అందుకున్న మొదటి చిత్రం గా మా "ఆటో రజని" నిలిచిపోతుంది అన్నారు దర్శక, నిర్మాతలు. అంతే కాకుండా ఎలెక్షన్ టైం లో మేము చేసిన 'జననేత జగనన్న' పాట గురించి ప్రత్యేకంగా మమ్ములను జగనన్న అభినందించడం జీవితంలో మర్చిపోలేము.

అలాగే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. హీరోయిన్ ,ఇంకా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల పూర్తి వివరాలు త్వరలో తెలియ జేస్తామన్నారు..దర్శకులు జొన్నలగడ్డ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications











