Don't Miss!
- News
అత్యాచారం కేసులో ఆశారాం బాపూను దోషిగా తేల్చిన గుజరాత్ కోర్టు
- Sports
IND vs NZ: స్టన్నింగ్ డెలివరీతో షేన్ వార్న్‌ను గుర్తు చేసిన కుల్దీప్ యాదవ్వీడియో
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Avatar 2 movie leaked.. అవతార్ 2 మూవీపై పైరసీ దెబ్బ.. రిలీజ్‌కు ముందే సోషల్ మీడియాలో లీక్
ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం అవతార్ 2. డిసెంబర్ 16వ తేదీన రిలీజ్ అవుతున్న ఈచిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జేమ్స్ కామెరాన్ నిర్మించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ భారీ రెస్పాన్స్ ఏర్పడింది. అయితే ఈ సినిమా ఫుల్ మూవీని సోషల్ మీడియాలో లీక్ చేయడం సంచలనంగా మారింది. ఈ లీక్ వివరాల్లోకి వెళితే..

4500 పైగా థియేటర్లలో
అవతార్ చిత్రం దేశవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్‌తో అదరగొడుతున్నది. ఈ సినిమాను 4500 పైగా థియేటర్లలో రిలీజ్ కానున్నది. దేశంలోనే సూపర్ స్టార్‌కు సినిమాకు ఉండే రెస్పాన్స్ కంటే ఎక్కువగా అవతార్ 2కు కనిపిస్తున్నది. దాదాపు 12 లక్షలకుపైగా టికెట్లు అమ్ముడయ్యాయి. దాదాపు 35 శాతానికిపైగా అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

భారత్‌లో రికార్డు స్థాయిలో
ఇండియాలో రికార్డుస్థాయిలో టికెట్ల అమ్మకాలు జరిగాయి. తాజా సమాచారం ప్రకారం.. హైదరాబాద్‌లో 3.1 కోట్లు, బెంగళూరులో 2.9 కోట్లు, ముంబైలో 1.89 కోట్లు, ఢిల్లీలో 1.75 కోట్లు, చెన్నైలో 1.25 కోట్లు, పూణెలో 78 లక్షల రూపాయలు వసూలు చేసింది. దేశవ్యాప్తంగా 12 కోట్ల మేర అడ్వాన్స్ బుకింగ్ రూపంలో కలెక్షన్లను రాబట్టింది. ఇంకా ఈ మొత్తం పెరిగే అవకాశం ఉంది.

లండన్, న్యూయార్క్, ముంబైలో ప్రీమియర్లు
అవతార్: ది వే ఆఫ్ వాటర్ మూవీని ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోని ముఖ్య పట్టణాల్లో ప్రీమియర్లు ప్రదర్శించారు. ఈ సినిమాను గతవారం లండన్, న్యూయార్క్ నగరాల్లో సినీ ప్రముఖులకు ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. ఇక మనదేశంలో బాలీవుడ్ ప్రముఖులకు రెండు రోజుల క్రితం సినిమాను ప్రదర్శించారు. బాలీవుడ్ ప్రముఖుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

పైరసీ భూతం పంజా
అయితే అవతార్ 2 సినిమా కోసం అందరూ వేచి చూస్తుండగా పైరసీ భూతం పంజా విసిరింది. ఎవరూ ఊహించని విధంగా సోషల్ మీడియాలో లీక్ చేయడం సంచలనంగా మారింది. ఈ సినిమా పైరసీ కాపీ టెలిగ్రామ్‌లో లీక్ చేశారు. దాంతో ఈ సినిమా రికార్డుస్థాయిలో పైరసీ జరిగిందనే విషయం సినీ వర్గాలను దిగ్బ్రాంతికి గురిచేసింది.

టెలిగ్రామ్‌లో లీక్ చేసిన పైరసీ మాఫియా
అవతార్ సినిమా హిందీ వెర్షన్ కాపీ ప్రస్తుతం టెలిగ్రామ్‌లో వైరల్ అయింది. ఈ సినిమా హిందీ వెర్షన్ పైరసీ కాపీ లింక్స్ టెలిగ్రామ్ యాప్‌లో లభ్యమవుతున్నట్టు సమాచారం. అయితే రిలీజ్‌కు ముందే ఈ సినిమా లీక్ కావడం సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. బాలీవుడ్ నుంచే ఈ సినిమా లీక్ అయిందా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

అవతార్ 2 మూవీలో ...
నటీనటులు:
సామ్
వార్తింగ్టన్,
జో
సల్దానా,
సీగుర్నీ
వీవర్,
స్టీఫాన్
లాంగ్,
కేట్
విన్స్‌లెట్,
క్లిఫ్
కర్టీస్,
జో
డేవిడ్
మూర్
తదితరులు
రచన,
స్క్రీన్
ప్లే,
కథ,
నిర్మాత,
దర్శకత్వం:
జేమ్స్
కామెరాన్
సహ
నిర్మాత:
జాన్
లాడావు
సినిమాటోగ్రఫి:
రస్సెల్
కార్పంటర్
ఎడిటింగ్:
స్టెఫాన్
ఈ
రివ్కిన్,
డేవిడ్
బ్రెన్నెర్,
జాన్
రెఫీవా
మ్యూజిక్:
సైమాన్
ఫ్రాగ్లెన్
బ్యానర్:
లైఫ్‌స్ట్రామ్
ఎంటర్‌టైన్‌మెంట్,
టీఎస్జీ
ఎంటర్‌టైన్‌మెంట్
రిలీజ్:
2022-12-16