Poorna: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ పూర్ణ.. ఫొటోలు వైరల్

తెలుగు ఇండస్ట్రీలో మంచి నటిగా గుర్తింపు పొందిన హీరోయిన్లలో పూర్ణ ఒకరు. శ్రీ మహాలక్ష్మీ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన పూర్ణ సీమటపకాయ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో తన నటన, డ్యాన్సు, అందంతో ప్రేక్షకులను ఫిదా చేసింది.

తర్వాత ఎక్కువగా డైరెక్టర్ రవిబాబు సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై పలు షోలలో కూడా అట్రాక్ట్ చేసింది. ఇక గతేడాది డిసెంబర్ లో తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన పూర్ణ తాజాగా ప్రసవించింది. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన పూర్ణ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

రియల్ స్టార్ శ్రీహారి ప్రధాన పాత్రలో నటించిన శ్రీ మహాలక్ష్మి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది ముద్దుగుమ్మ పూర్ణ. అల్లరి నరేష్ హీరోగా చేసిన కామెడీ అండ్ లవ్ స్టోరీ మూవీ సీమటపకాయ్ తో హీరోయిన్ గా డెబ్యూ చేసింది. ఈ సినిమా సూపర్ హిట్ సాధించిన తర్వాత ఎక్కువగా ఆమె డైరెక్టర్ రవిబాబు దర్శకత్వం వహించిన సినిమాల్లో ఎక్కువగా నటించింది. వీరిద్దరి కాంబినేషన్ లో అవును, అవును 2 మూవీస్ వచ్చిన విషయం తెలిసిందే. వీటిలో అవును హిట్ కాగా.. అవును 2 ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.

Avunu Movie Actress Poorna Blessed With Baby Boy In Dubai

ఇక హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడంతో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది బ్యూటిఫుల్ పూర్ణ. డ్యాన్స్ షోకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ అప్పుడప్పుడు సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ ఆకట్టుకుంటూ వస్తోంది. ఈ క్రమంలోనే గతేడాది బాలకృష్ణ అఖండ సినిమాలో నటించింది. ఇక తాజాగా విడుదలైన నాని దసరా సినిమాలో కీలక పాత్ర పోషించింది పూర్ణ. కథను మలుపు తిప్పే పాత్రలో నటించి ఆకట్టుకుంది. అలాగే త్వరలో రవిబాబు దర్శకత్వంలోనే అసలు సినిమాతో ఓటీటీలోకి నేరుగా ఎంట్రీ ఇవ్వనుంది ఈ భామ.

ఇదిలా ఉంటే మలయాళ నటి అయిన పూర్ణ అసలు పేరు షమ్నా ఖాసీమ్ (Shamna Kasim). గతేడాది జేబీఎస్ గ్రూప్ కంపెనీ ఫౌండర్, సీఈవో షనీద్ అసిఫ్ అలీని పెళ్లి చేసుకుంది పూర్ణ. వీరి వివాహం దుబాయ్ లో వైభవంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు షేర్ చేసిన పూర్ణ తాజాగా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.

హాస్పిటల్ లో డెలివరీ తర్వాత బిడ్డను ఎత్తుకున్న ఫొటోలు పోస్ట్ చేసింది. డాక్టర్ల టీమ్ కు థ్యాంక్స్ తెలిపింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో నటి పూర్ణకు అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా ప్రస్తుతం తమిళం, మలయాళం భాషల్లో పదం పేసుమ్, బ్యాక్ డోర్, వృత్తం, అమ్మాయి, పిసాసు 2 వంటి చిత్రాల్లో నటిస్తోంది ఈ పూర్ణ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X