twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అ! దర్శకుడి ఆలోచనలు మామూలుగా లేవు.. అంతకు మించిన కథలు!

    |

    డిఫరెంట్ గా ప్రయత్నం చేసి ప్లాప్ అందుకున్న కూడా కొంతమంది దర్శకులు ఓ వర్గం ఆడియెన్స్ ని గట్టిగానే ఆకర్షిస్తారు. ఉదాహరణకు క్రిష్ సినిమాలు కలెక్షన్స్ తో సంబంధం లేకుండా ప్రశంసలు అందుకుంటాయి. ఆయనతో సినిమా చేయడానికి స్టార్ హీరోలు నిత్యం రెడీగా ఉంటారు. అయితే అదే రూట్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి అ!దర్శకుడు ప్రశాంత్ వర్మ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు.

    నాని ఎంతగానో నమ్మి తన మొదటి ప్రొడక్షన్ హౌజ్ లో ప్రశాంత్ వర్మకి అ! సినిమాతో అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా అనుకున్నంతగా వర్కౌట్ కాలేదు. సీక్వెల్ కథను రెడీ చేసినప్పటికీ ఎందుకో నాని మళ్ళీ అతనితో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపలేదు. ఇక అ! తరువాత రాజశేఖర్ తో కల్కి అనే సినిమా చేసిన ప్రశాంత్ వర్మ పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు.

    awe director prashanth varma upcoming project plans

    ఆ సినిమా వచ్చినట్లు కూడా చాలా మందికి తెలియదు. ఇక నెక్స్ట్ కూడా ఆడియెన్స్ ని థ్రిల్ చేయాలని ప్రశాంత్ దాదాపు 30కథలను రెడీ చేసుకున్నాడట. ఇక తమిళ్, హిందీ నుంచి అ! సినిమాను రీమేక్ చేసే ఆఫర్స్ వస్తున్నప్పటికీ ప్రశాంత్ ఏ మాత్రం ఒప్పుకోవడం లేదట.

    వీలైనంత వరకు తెలుగులో అ! సీక్వెల్ ని రెడీ చేయాలని చూస్తున్నాడు. ఇక ప్రస్తుతం ప్రశాంత్ వర్మ జాంబీ రెడ్డి అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ కంటే డేంజర్ అంటూ తనదైన శైలిలో సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేస్తున్నాడు. అలాంటి సినిమా ఇంతవరకు తెలుగులో రాలేదనే టాక్ వస్తోంది. మరి ఈ సారైనా దర్శకుడు అన్ని వర్గాల ఆడియేన్స్ ని మెప్పిస్తాడో లేదో చూడాలి.

    English summary
    Even with a different endeavor and a flop, some directors are more likely to appeal to a certain category of audience. Krish movies for example receive accolades regardless of collections. Star heroes are always ready to make a movie with him. However, director Prashanth Verma is working hard to make a name for himself on the same route.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X