Prabhas: ప్రభాస్‌కు మరో అరుదైన గౌరవం... తెలుగు నుంచి చిరంజీవి తర్వాతే ఆయనకు పిలుపు!

రెబల్ స్టార్ ప్రభాస్.. తాజాగా సలార్ సినిమాతో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇదిలా ఉంటే.. ప్రభాస్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే ఆదిపురుష్ సినిమాతో దేశ ప్రజలకు రాముడిగా కనిపించిన ప్రభాస్ కు.. అయోధ్య నుంచి పిలుపు వచ్చింది. ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్య రామామందరి ప్రారంభోత్సం వచ్చే ఏడాది జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మహోత్సవానికి తెలుగు నుంచి చిరంజీవికి ఆహ్వానం దక్కగా.. తాజాగా ప్రభాస్ కు కూడా ఆహ్వానం అందింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఈ ఏడాది ఆదిపురుష్, సలార్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆదిపురుష్ బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ఆడకపోయినా.. ఆ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించాడు. దీంతో సిల్వర్ స్క్రీన్ మీద రాముడిగా ప్రభాస్ కనబడటం ఫ్యాన్స్ కు పండగే అని చెప్పవచ్చు. ఇక సలార్ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.

Ayodhya Ram Mandir Inauguration Chiranjeevi, Prabhas, Yash, Ranbir Kapoor, Alia Bhatt, Invited to the Ceremony

ఇదిలా ఉంటే.. ప్రభాస్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. అయోధ్య నుంచి ఆది పురుష్ కు ఆహ్వానం అందింది. అదే మన రెబల్ స్టార్ ప్రభాస్ కు ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ఇన్విటేషన్ అందింది. రామమందిరం వచ్చే సంవత్సరం జనవరి 22న జరిగే రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సినీ నటుడు ప్రభాస్ కు ఆహ్వానం పంపించారు.

ఇక తెలుగు నుంచి అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్టకు రావాలని చిరంజీవికి ఆహ్వానం వచ్చింది. ఇక చిరంజీవి తర్వాత ఆయనకే ఈ గౌరవం దక్కింది. ఇక ఈయనతో పాటు... రణబీర్ కపూర్, ఆలియా భట్, అక్షయ్ కుమార్, అజయ్ దేవ్ గన్, సన్నీ దేవోల్, ఆయుష్మాన్ ఖురానా, టైగర్ ష్రాఫ్, , సంజయ్ లీలా భన్సాలీ, రోహిత్ శెట్టి, రాజ్‌కుమార్ హిరానీ, యష్ సహ బాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందాయని తెలుస్తోంది.

Ayodhya Ram Mandir Inauguration Chiranjeevi, Prabhas, Yash, Ranbir Kapoor, Alia Bhatt, Invited to the Ceremony

అయోధ్య రామాలయం ప్రతిష్టాపన కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వందల ఏళ్లుగా అయోధ్యలో రామాలయం కావాలని కోరుకున్న కోట్లాదిమంది భారతీయుల కల నెరవేరే రోజు జనవరి 26. ఇప్పటికే దాదాపుగా రామ మందిర నిర్మాణ పనులు పూర్తి అయిపోయాయి. జనవరి 22వ తేదీన రామ మందిరంలో రామచంద్రమూర్తి కొలువు దీరనున్నారు.

ఆరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు విగ్రహ ప్రతిష్ట జరుగనుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రానున్నారు. ఈ వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా మీడియాలో చూపించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మహోత్సవాన్ని జరుపనుంది. విగ్రహ ప్రతిష్టకు సంబంధించి కార్యక్రమాలు జనవరి 16 నుంచే ప్రారంభం అవుతాయి. జనవరి 22వ తేదీ మృగశిర నక్షత్ర సుముహూర్తంలో విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది. ఇక ఈ వేడుకకు దేశం నుంచి ప్రముఖులు హాజరు కానున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X