అయ్యయ్యో వద్దమ్మా.. అందుకే కొట్టారు.. దాడిపై క్లారిటీ ఇచ్చిన సుఖీభవ శరత్!

అయ్యో వద్దమ్మ..సుఖీభవా అనే కమర్షియల్ యాడ్ ను డైలాగ్ గా మార్చేసి డాన్స్ చేసిన శరత్ ఇటీవల బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఓవర్ నైట్ లోనే శరత్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతనికి పలు సినిమా ఆఫర్స్ కూడా వచ్చాయి అయితే రీసెంట్ గా అతని పై దాడి జరగడంతో ఆ వార్త కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయింది. దాడి ఎందుకు జరిగింది అనే విషయంలో అనేక రకాల అనుమానాలు వచ్చాయి. ఫైనల్గా డాన్సర్ శరత్ మీడియా ముందుకి వచ్చి ఆ విషయం పై క్లారిటీ ఇచ్చాడు.

ఒకేసారి 15 మందితో దాడి

ఒకేసారి 15 మందితో దాడి


ఒకేసారి 15 మంది వచ్చే దాడిచేయడంతో డాన్సర్ శరత్ లోకల్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. అయితే అతను ఇమిటేట్ చేసిన యాడ్ లో హిజ్రా ప్రధాన పాత్ర కావడంతో కావాలని హిజ్రాలు శరత్ పై దాడి చేసినట్లుగా సోషల్ మీడియాలో కొన్ని కథనాలు అయితే వెలువడ్డాయి. ఒకేసారి మూకుమ్మడిగా అతనిపై దాడి చేయడంతో కంటిపై కూడా తీవ్ర గాయం అయినట్లు తెలుస్తోంది. అయితే ఆ విషయంపై ఫైనల్ శరత్ మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చాడు.

కావాలని దాడి చేశారు

కావాలని దాడి చేశారు

దాడి జరిగిన విషయంపై మాట్లాడుతూ.. నిజానికి హిజ్రాలు తన పై ఎటాక్ చేశారని చాలా మంది చెబుతున్నారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. నేను ఇంతకుముందు ఒక వ్యక్తిని కొట్టడం జరిగింది. అతని సన్నిహితులు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో నేను పోలీస్ స్టేషన్ కు కూడా వెళ్లాల్సి వచ్చింది. అయితే జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా తనపై కావాలని కక్షగట్టి వాళ్ళు దాడి చేశారు.

వాళ్ళను ఎందుకు కొట్టాను అంటే..

వాళ్ళను ఎందుకు కొట్టాను అంటే..


నేను వాళ్లను ఎందుకు కొట్టాను అంటే ఇంతకు ముందు నా స్నేహితుడు భార్య పై అసభ్యంగా ఫోన్ లు చేసి వేధించడం జరిగింది. అందుకే మేము అందరం కలిసి సాయి అనే వ్యక్తి దాడి చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత వాళ్ళు మాపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో మమ్మల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చి నప్పటికీ నాపై టార్గెట్ పెట్టారు. ఈ దాడి కేవలం మేము కొట్టినందుకు మాత్రమే కాదు. మరొక కారణం కూడా ఉంది.. నన్ను కావాలని ఎదగనివ్వకుండా కిందకు లాగాలని వారు ప్రయత్నం చేశారు.

వాళ్ళు రాకపోతే.. నన్ను చంపేసేవారు..

వాళ్ళు రాకపోతే.. నన్ను చంపేసేవారు..


నా సుఖీభవ వీడియో బాగా వైరల్ అవ్వడం తో ఒకేసారి మూడు సినిమాలలో నటించే అవకాశం వచ్చింది. ఆ విషయం తెలుసుకున్న వాళ్ళు నాపై ఎలాగైనా పగ తీర్చుకుని నన్ను ఎదగకుండా చేయాలని అనుకున్నారు. దుర్గ మాత నిమజ్జనం ఉన్న సమయంలో నన్ను టార్గెట్ చేసి దాడి చేశారు. ఒకేసారి 15 మంది వచ్చి నాపై మూకుమ్మడిగా దాడి చేయడంతో నేను ఎటు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇక ఆ తర్వాత పోలీసులు వచ్చి ఆపడంతో నేను బ్రతికి బయటపడ్డాను. ఆ సమయంలో పోలీసులు రాకపోతే నన్ను చంపేసేవారు అని శరత్ వివరణ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X