RGVపై లేడి గెటప్‌లో సుస్సు.. B.కామ్‌లో ఫిజిక్స్ న్యూ పోస్టర్‌తో మరో కాంట్రవర్సీ
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సినిమా షూటింగ్స్ చేయలేక అగ్ర దర్శకులు, నిర్మాతలు సతమతమవుతుంటే రామ్ గోపాల్ వర్మ మాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు తీసేస్తున్నారు. ఇక ఏ మాత్రం లిమిట్స్ లేకుండా కథలను డిజైన్ చేస్తున్న ఆర్జీవికి కొన్ని ఊహించని కౌంటర్లు వస్తున్నాయి. వర్మ ఏ దారిలో అయితే వస్తున్నాడో అదే దారిలో అతని క్రేజ్ ని క్యాష్ చేసుకుంటున్నారు కొందరు. ఇటీవల వర్మకు కౌంటర్ ఇచ్చే విదంగా బి.కామ్ లో ఫిజిక్స్ అనే కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు.

B.కామ్ లో ఫిజిక్స్ పోస్టర్
పోస్టర్ చూసిన తరువాత అసలు ఈ సినిమా తీసింది ఎవరు అనే విధంగా సోషల్ మీడియాలో ఒక టాక్ వైరల్ అవుతోంది. ఇప్పటికే పరాన్న జీవితో వర్మకు కౌంటర్ వస్తూనే ఉంది. ఇక నెక్స్ట్ అదే తరహాలో రియాక్షన్ ఇచ్చేలా B.కామ్ లో ఫిజిక్స్ ని ప్లాన్ చేస్తున్నట్లు అర్ధమవుతోంది. ఆ పోస్టర్ ని కాస్త బోల్డ్ గా చూపించడంతో హాట్ టాపిక్ గా నిలుస్తోంది.

RGV పేరుపై సుస్సు
ఒక గోడపై ఆర్జీవి పేరు ఉండగా ఆ పేరు పై రెండు జడలు వేసుకున్న లేడి గెటప్ లో ఉన్న వ్యక్తి ఏకంగా సుస్సు పోస్తున్నట్లు చూపించడం షాక్ కి గురి చేస్తోంది. అదే విధంగా ఆ పక్కనే మరో బాలీవుడ్ నిర్మాత పేరు, టెంప్ట్ రవి, రాకేష్ మాస్టర్ వంటి పేర్లు ఉండడం, అలాగే కత్తి మహేష్ లాంటి పేరు ఉండడం సోషల్ మీడియాలో సరికొత్త వివాదానికి దారు తీస్తోంది.

ఇలాంటి సినిమాలేంటి బాబు
ఈ కరోనా కాలంలో ఇలాంటి సినిమాలేంటి బాబు అని కొందరు కామెంట్స్ చేస్తున్నా కూడా వైరల్ చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇక B.కామ్ లో ఫిజిక్స్ అనే టైటిల్ ని ఎందుకు ఎంచుకున్నారు అనేది మరో ట్విస్ట్. ఎందుకంటే ఆ డైలాగ్ తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫెమాస్ అనేది అందరికి తెలిసిందే. ముందుగా టైటిల్ తోనే సినిమాపై ఎక్కువగా ఫోకస్ చేసేలా చేస్తున్నారు.
Recommended Video

80శాతం షూటింగ్ పూర్తి
ఇక సినిమా యూనిట్ విషయానికి వస్తే.. 'ఏడు చేపల కథ' దర్శకుడు శ్యామ్ జే చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ మొత్తానికి ఆర్జీవి పవర్ స్టార్ వివాదంలో హాట్ టాపిక్ గా నిలిచింది. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ 80 శాతం వరకు పూర్తయినట్లు తెలుస్తోంది. అంకిత రాజ్ పుత్, యశ్వంత్, నగరం సునీల్, మేఘన చౌదరి లాంటి వాళ్ళు నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోనే రిలీజ్ కానున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











