బి.సరోజాదేవికి టీఎస్ఆర్ ‘విశ్వనట సామ్రాజ్ఞి’ బిరుదు ప్రదానం
సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్ ఆధ్వర్యంలో ఏటా విశాఖ సాగరతీరంలో నిర్వహించే మహా కుంభాభిషేకం ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించారు. విశాఖ జిల్లా నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి కూడా పెద్దఎత్తున భక్తులు సాగరతీరానికి తరలివచ్చారు.
ఈ సందర్భంగా ప్రముఖ నటి బి.సరోజాదేవికి 'విశ్వనట సామ్రాజ్ఞి' బిరుదు ప్రదానం చేశారు. ఈ సందర్బంగా కళాబంధు సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ.. ఆ రోజుల్లో హీరోల్ని మించి పారితోషికం అందుకొన్న కథానాయిక బి.సరోజాదేవి. అందుకే ఆమెకి తెలుగు ప్రజల తరఫున 'విశ్వనట సామ్రాజ్ఞి'' బిరుదు ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు.

సరోజాదేవి మాట్లాడుతూ... 'టి.సుబ్బరామిరెడ్డికి కళలన్నా, కళాకారులన్నా ఎంతో గౌరవం. శివరాత్రి రోజున ఈ పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉంది. నేనెక్కడ కనిపించినా తెలుగు ప్రేక్షకులు 'చిటపట చినుకులు పడుతూ ఉంటే...పాటని గుర్తు చేస్తుంటారు. 'కృష్ణార్జునయుద్ధం'లో నేను ఎన్టీఆర్‌ని చిన్నన్నయ్యా అంటుంటాను. ఆ సంభాషణని గుర్తు చేసి ఒకసారి చెప్పండని అడుగుతుంటారు. మరోసారి ఈ వేదికపై ఆ విషయాన్ని గుర్తు చేసుకోవడం ఆనందంగా ఉంది.' అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ద్రోణంరాజు శ్రీనివాస్, పడాల అరుణ, నటుడు, ఎంపీ మురళీమోహన్ నటీమణులు జమున, వాణిశ్రీ, గీతాంజలి, గాయని పి.సుశీల తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











