twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలీవుడ్‌లో రికార్డ్ క్రియేట్ చేసిన నాని: హాట్ టాపిక్ అవుతోన్న ‘శ్యామ్ సింగ రాయ్’

    |

    స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన టాలెంట్‌తో చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు నేచురల్ స్టార్ నాని. ప్రతి సినిమాలోనూ సహజ సిద్ధమైన నటనను కనబరిచే అతడు.. అన్నింటినీ వన్ మ్యాన్ షోలుగా మార్చుకున్నాడు. తద్వారా మంచి నటుడిగా పేరు తెచ్చుకోవడంతో పాటు ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే 'టక్ జగదీష్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఓటీటీలో విడుదలైన ఈ మూవీకి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

    బెడ్‌పై అర్ధనగ్నంగా ఇలియానా రచ్చ: వామ్మో అదొక్కటి అడ్డు లేకుంటే అంతే సంగతులుబెడ్‌పై అర్ధనగ్నంగా ఇలియానా రచ్చ: వామ్మో అదొక్కటి అడ్డు లేకుంటే అంతే సంగతులు

    హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసే నాని.. ఈ మధ్య కాలంలో కొన్ని ప్రాజెక్టులను పట్టాలెక్కించేశాడు. అందులో 'ట్యాక్సీవాలా'తో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్న రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్‌లో వస్తున్న 'శ్యామ్ సింగ రాయ్' ఒకటి. పూర్తి స్థాయి విభిన్నమైన కథతో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. చాలా రోజుల క్రితమే మొదలైన ఈ మూవీ షూటింగ్ ఇటీవలే పూర్తైంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

    B4u Bagged Nanis Shyam Singha Roy Dubbing Rights

    సరికొత్త నేపథ్యంతో రూపొందుతోన్న 'శ్యామ్ సింగ రాయ్' మూవీలో వీఎఫ్ఎక్స్ షాట్స్ ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. అందుకే ఇది షూటింగ్‌ను ఎప్పుడో పూర్తి చేసుకున్నా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రం ఇంకా పూర్తి కాలేదనే టాక్ వినిపిస్తోంది. ఇక, ఈ సినిమా కూడా 'టక్ జగదీష్' మాదిరిగానే ఓటీటీలో నేరుగా విడుదల అవుతుందని ప్రచారం జరిగింది. కానీ, దీన్ని మాత్రం థియేటర్లలోనే విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ కొద్ది రోజుల క్రితమే ప్రకటించింది. అదే సమయంలో నేచురల్ స్టార్ నాని కూడా ఇటీవల కొన్ని ఇంటర్వ్యూల్లో ఈ విషయాన్ని స్ఫష్టం చేశాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ న్యూస్ ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది.

    అరాచకమైన ఫొటోలతో షాకిచ్చిన అమలా పాల్: బీచ్‌లో బికినీతో అందాలు మొత్తం కనిపించేంత ఘాటుగా!అరాచకమైన ఫొటోలతో షాకిచ్చిన అమలా పాల్: బీచ్‌లో బికినీతో అందాలు మొత్తం కనిపించేంత ఘాటుగా!

    క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'శ్యామ్ సింగ రాయ్' మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. దీంతో ఈ సినిమాకు సంబంధించిన అన్ని ఏరియాల థియేట్రికల్ హక్కులు భారీ ధరలకు అమ్ముడుపోయాయి. అదే సమయంలో శాటిలైట్, డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు కూడా అత్యధిక మొత్తాలకే పలు సంస్థలు సొంతం చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్‌ను B4u అనే సంస్థ రికార్డు ధరకు కొనుగోలు చేసినట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇది నాని కెరీర్‌లోనే అత్యధిక మొత్తమే కాదు.. స్టార్ హీరోల సినిమాలకు సమానమైన డీల్ అని తెలుస్తోంది.

    B4u Bagged Nanis Shyam Singha Roy Dubbing Rights

    పూర్తి స్థాయి వైవిధ్యమైన కథతో రాబోతున్న 'శ్యామ్ సింగ రాయ్' నుంచి ఇప్పటి వరకూ విడుదలైన అన్ని పోస్టర్లకు భారీ రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఇందులో నాని కోరమీసంతో కనిపించిన తీరు ఆకట్టుకుంది. ఇక, ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జిషు సేన్ గుప్తా, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమఠం కీలక పాత్రలు పోషించారు. వెంకట్ బోయినపల్లి దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఇక, ఈ మూవీ ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

    English summary
    Natural Star Nani Did Shyam Singha Roy Movie Under Shyam Singha Roy Direction. Now B4u Bagged This Movie Hindi Dubbing Rights.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X