ప్రభాస్ బర్త్ డే కానుకగా.. అమెరికాలో భారీగా బాహుబలి2 మళ్లీ రిలీజ్..
ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన బాహుబలి 2 చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నది. ప్రభాస్ జన్మదినం సందర్భంగా ఈ చిత్రాన్ని అభిమానుల ముందుకు తీసుకువచ్చేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాతోపాటు దేశంలో కూడా ఈ సినిమాను అక్టోబర్ 23వ తేదీన రిలీజ్ చేయాలని నిర్ణయించారు.
2017లో రిలీజైన బాహుబలి: ది కన్‌క్లూజన్ చిత్రం రికార్డుస్థాయి కలెక్షన్లు సాధించింది. దేశంలో దాదాపు 1000 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. అమెరికాలో 20 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అలాంతి సంచలన చిత్రాన్ని అమెరికాలో మరోసారి రిలీజ్ చేయనున్నారు. ప్రభాస్ బర్త్ డే సందర్బంగా అమెరికాలోని 25 లోకేషన్లలో రిలీజ్ చేయనున్నారు. ఇక యూఎస్‌లో లాక్‌డౌన్ తర్వాత విడుదలయ్యే తొలి తొలుగు చిత్రంగా రికార్డు సృష్టించనున్నది.

అయితే బాహుబలి రిలీజ్ వార్త బయటకు రాగానే సోషల్ మీడియాలో బాహుబలి హ్యాష్ ట్యాగ్ నంబర్ వన్ ట్రెండింగ్‌గా మారింది. రెండోసారి రిలీజ్ అవుతున్న ఈ చిత్రం రికార్డులు తిరగరాస్తుందా? ప్రేక్షకులను మళ్లీ థియేటర్లకు రప్పిస్తుందా అనే విషయంపై చర్చ జరుగుతున్నది.
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సిరీస్‌లో ప్రభాస్, అనుష్కశెట్టి, రానా దగ్గుబాటి, తమన్నా, రమ్యకృష్ణ తదితరులు నటించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











