బాహుబలి సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ సతీమణి ఆకస్మిక మృతి.. కారణం ఏమిటంటే?
బాహుబలి, సంచలన సినిమాలకు సినిమాటోగ్రఫిని అందించిన సెంథిల్ కుమార్‌కు తీవ్ర విషాదం ఎదురైంది. తన ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన సతీమణి రూహీ ఆకస్మికంగా మరణించడం తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆమె మరణవార్త సినీ ప్రముఖులను అభిమానులను కలతకు గురిచేస్తున్నది. ఆమె మరణానికి ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. రూహీ మరణానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ సతీమణి యోగా టీచర్‌గా పనిచేస్తున్నారు. గతకొద్దికాలంగా ఆమె ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అనారోగ్యానికి గురైన ఆమెకు ప్రముఖ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమంగా మారి మృత్యువాత పడ్డారు. ఆమె మరణంతో సెంథిల్ కుమార్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది.

సెంథిల్ కుమార్ సతీమణి రూహీ కొద్దికాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. ఆమెకు కిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. అయితే ఆమె ఆరోగ్యం గురువారం (ఫిబ్రవరి15వ తేదీన) విషమించడంతో తుదిశ్వాస విడిచారు అని సన్నిహితులు తెలిపారు.
కిమ్స్ హాస్పిటల్ నుంచి రూహీ పార్థీవదేహాన్ని తమ నివాసానికి సెంథిల్ కుమార్ కుటుంబ సభ్యులు తరలించారు. ఆమె అంత్యక్రియులు శుక్రవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో జరుగుతాయి అని పేర్కొన్నారు.
సెంథిల్ కుమార్‌కు సతీ వియోగం కావడంతో సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలిపారు. కొంత మంది స్నేహితులు, సన్నిహితులు ఆయనకు ఫోన్ చేసి పరామర్శిస్తున్నారు.


Click it and Unblock the Notifications











