twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sathyaraj ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా.. హాస్పిటల్‌లో చేరిన కట్టప్ప!

    |

    దేశవ్యాప్తంగా కరోనావైరస్ థర్డ్ వేవ్ విజృంభిస్తున్నది. పలు రాష్ట్రాల్లో రికార్డుస్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. దీంతో సినీ పరిశ్రమ కూడా సంక్షోభం దిశగా ప్రయాణిస్తున్నది. సినిమాను కరోనావైరస్ అతలాకుతలం చేస్తున్నది. దేశవ్యాప్తంగా పలువరు సినీ ప్రముఖులు కోవిడ్ 19 వైరస్ బారిన పడి కోలుకొంటున్నారు. గత నెల రోజులగా కమల్ హాసన్, వడివేలు, చియాన్ విక్రమ్, త్రిషా కృష్ణన్, మహేష్ బాబు, మంచు లక్ష్మి, థమన్, నితిన్ భార్య, విశ్వక్ సేన్ లాంటి సినీ ప్రముఖులు కరోనా నుంచి కోలుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

    ఇలాంటి ఆందోళనకరమైన వార్తల నడుమ సినీయర్ నటుడు, కట్టప్ప పాత్రధారి సత్యరాజ్ హాస్పిటల్ పాలయ్యారు. కొద్ది రోజుల క్రితం సత్యరాజ్‌ కరోనావైరస్ బారిన పడ్డారు. హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. జనవరి 7వ తేదీన ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో చెన్నైలోని అమింజిక్కరై హాస్పిటల్‌లో చేర్పించారు.

    Baahubali fame Kattappa Sathyaraj hospitalised in Chennai due to Coronavirus Positive

    విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. శుక్రవారం సత్యరాజ్ ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా మారింది. వెంటనే వైద్యుల సూచన మేరకు ఆయనను హాస్పిటల్‌లో చేర్పించారు. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలు అందాల్సి ఉంది తెలిసింది. సత్యరాజ్‌కు నిర్వహించిన టెస్టుల ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. త్వరలోనే హాస్పిటల్ వర్గాలు వివరాలు అందిస్తారు. అప్పటి వరకు అభిమానులు, స్నేహితులు, సన్నిహితులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు అంటూ హాస్పిటల్ వర్గాలు స్పష్టం చేశాయి.

    సంక్రాంతి సమయంలో ఎప్పడూ సందడిగా ఉండే సినీ పరిశ్రమ మూగబోయింది. బాక్సాఫీస్ నిరాశజనకంగా మారింది. రిలీజ్‌కు సిద్దంగా ఉన్న భారీ బడ్జెట్, అగ్రహీరోల సినిమాల రిలీజ్ వాయిదా పడ్డాయి. RRR, జెర్సీ, రాధేశ్యామ్, వలిమై చిత్రాల రిలీజ్‌ను నిరవధికంగా వాయిదా వేశారు.

    English summary
    Baahubali fame Kattappa Sathyaraj hospitalised in Chennai due to Coronavirus Positive. Reports suggested that, Sathyaraj was immediately rushed to the hospital after he exhibited serious symptoms.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X