పేకమేడలు కడుతున్న బాహుబలి ఫేమ్ రాకేశ్ వర్రే.. ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ వైరల్
బాహుబలి మూవీలో సేతుపతి క్యారెక్టర్‌తో విశేషంగా ఆకట్టుకొన్న యువ నటుడు రాకేశ్ వర్రే హీరోగా, నటుడిగా నిలదొక్కుకొనేందుకు తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన శైలిలో రాణిస్తున్నారు. ఇటీవల క్రేజీ యాంట్స్ బ్యానర్‌పై ఆయన నటించిన ఎవరికీ చెప్పొద్దు మూవీ నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌పై అత్యధిక మంది వీక్షించిన చిత్రంగా నిలిచింది.
ఆ సినిమా అందించిన జోష్‌తో రాకేశ్ వర్రే ప్రస్తుతం అదే బ్యానర్‌పై పేకమేడలు అనే మంచి కంటెంట్ ఉన్న చిత్రాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రంలో నా పేరు శివ, అంధకారం లాంటి చిత్రాల్లో నటించి మెప్పించిన వినోద్ కిషన్, యువ హీరో అనూష కృష్ణ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా వివరాలు, విశేషాల్లోకి వెళితే..

పేకమేడలు సినిమాలో దాదాపు 50 టాలెంటెడ్ యాక్టర్లను పరిచయం చేస్తున్నారు. అలాగే ఈ సినిమాకు ప్రతిభావంతులైన, సీనియర్ సాంకేతిక నిపుణులు భాగస్వామ్యమయ్యారు. జల్లికట్టు లాంటి సినిమాకు పనిచేసిన ప్రముఖ సౌండ్ డిజైనర్ రంగనాథ్ రావీ, సౌండ్ మిక్సర్ కన్నన్ గణ్‌పత్ ఈ సినిమాకు పనిచేస్తున్నారు.
పేకమేడలు ద్వారా నీలగిరి మామిళ్ల అనే నూతన దర్శకుడు తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. శరవేగంగా షూటింగ్ పనులు పూర్తి చేసుకొంటున్న నేపథ్యంలో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ పోస్టర్‌ను, మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పేకమేడలు పోస్టర్‌లో రాకేశ్ వర్రే ప్రామిసింగ్‌గా కనిపించారు.
ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ద్వారా రివీల్ చేసిన పేకమేడలు టైటిల్ సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకొంటున్నది. మోషన్, ఫస్ట్ లుక్ పోస్టర్‌లో హైదరాబాద్ నగరాన్ని 360 డిగ్రీల కోణంలో చూపించారు. పోస్టర్ చూస్తే పేకమేడలు టైటిల్ కచ్చితంగా సరిపోయిందని సినీ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతున్నది. పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని ఆగస్టు నెలలో రిలీజ్‌కు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు.
నటీనటులు: రాకేశ్ వర్రే, వినోద్ కిషన్, అనూషా కృష్ణ తదితరులు
రచన, దర్శకత్వం: నీలగిరి మామిళ్ల
నిర్మాత: రాకేశ్ వర్రే
స్క్రీన్ ప్లే: హమ్జా ఆలీ, శ్రీనివాస్ ఇత్తం, నీలగిరి మామిళ్ల
డైలాగ్స్, సాహిత్యం: భార్గవ కార్తీక్
సహ నిర్మాత: వరుణ్ బోరా
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కేతన్ కుమార్
మ్యూజిక్: స్మరణ్
ఎడిటర్: సృజన్ అడుసుమిల్లి, హమ్జా ఆలీ


Click it and Unblock the Notifications











