దాని కోసమైతే పెళ్లి చేసుకోవద్దు... భార్యతో అలా ఉండాల్సిందే.. బాహుబలి నటుడి వార్నింగ్

ఇటీవలి కాలంలో పెళ్లి చుట్టూ ఎన్నో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అవుదామంటే పిల్ల దొరక్క పెళ్లికాని ప్రసాదులు పెరిగిపోతుండగా.. మరికొందరు రెండు మూడు పెళ్లిళ్లు చేసుకుని ఇద్దరినీ మెయింటైన్ చేస్తున్నారు. మరోవైపు జీవిత భాగస్వామితో మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య.. వివాహేతర సంబంధాల కారణంగా భాగస్వామిని దారుణంగా హత్య చేస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఒకరకంగా చెప్పాలంటే సమాజంలో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పెళ్లి, వైవాహిక సంబంధాలపై టాలీవుడ్ నటుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే...

విలన్‌గా, హాస్యనటుడిగా, సహాయ నటుడిగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు సుబ్బరాజు. ఇప్పుడంటే కాస్త స్పీడ్ తగ్గింది కానీ... ఒకప్పుడు ఆయన ప్రతి సినిమాలో ఉండాల్సిందే. కొందరు హీరోలు, దర్శకులకైతే ఆయన ఆస్థాన నటుడు. సుబ్బరాజు పూర్తి పేరు పెనుమత్స సుబ్బరాజు. 2003లో కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఖడ్గం సినిమాతో సినీరంగంలో అడుగుపెట్టారు. చిన్నాచితకా పాత్రలు పోషిస్తూ నిలదొక్కుకుంటున్న సుబ్బరాజు కెరీర్‌ను అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా మలుపు తిప్పింది. ఇందులో నెగిటివ్ రోల్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సుబ్బరాజు. నాటి నుంచి పూరీ జగన్నాథ్ తీసే ప్రతి సినిమాలోనూ సుబ్బరాజు నటించాల్సిందే.

Baahubali fame Subbaraju s Sensational Comments on Marriage Why Expectations Are Causing Relationship Failures

ఆర్య, పోకిరి, యోగి, దేశముదురు, భద్ర, బిల్లా, ఓం నమో వెంకటేశాయ, పవర్, దూకుడు, ఇద్దరమ్మాయిలతో, మిర్చి, టెంపర్, శ్రీమంతుడు, నేనింతే తదితర చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు సుబ్బరాజు. ఇలాంటి దశలో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన పాన్ ఇండియా మూవీ బాహుబలి 2 .. సుబ్బరాజుకు దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చింది. అందులో ఓ రాజకుమారుడు కుమారవర్మ పాత్రలో కామెడీ, వీరత్వం ఒకసారి పలికించారు. ముందు భయపడుతూ ఆడవాళ్ల వెనుక దాక్కునే క్యారెక్టర్ నుంచి కదనరంగంలోకి దూకే వీరుడిగా అద్భుతంగా నటించారు. ఈ సినిమా తర్వాత ఆయనకు పలు భాషా చిత్రాలలో అవకాశాలు వచ్చాయి. గతేడాది జాక్, హరిహర వీరమల్లు సినిమాలలో నటించిన సుబ్బరాజు... ఈ ఏడాది మరికొన్ని ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్నారు. వాటి వివరాలు తెలియాల్సి ఉంది.

కెరీర్‌పైనే ఫోకస్ పెట్టిన సుబ్బరాజు 50 ఏళ్లకు చేరువ అవుతున్నా పెళ్లి మాట ఎత్తలేదు. ఈ దశలో బ్యాచిలర్ లైఫ్‌కు వీడ్కోలు పలుకుతూ సైలెంట్‌గా పెళ్లి పీటలెక్కి షాకిచ్చారు ఈ నటుడు. 2024 నవంబర్‌లో పెళ్లి చేసుకుని భార్యతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి కలకలం రేపారు సుబ్బరాజు. అయితే ఈ పెళ్లి ఎప్పుడు? ఎక్కడ జరిగింది? ఆమె భార్య పేరు వంటి వివరాలు మాత్రం సుబ్బరాజు వెల్లడించలేదు. నాటి నుంచి కెరీర్‌తో పాటు ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో వైవాహిక జీవితం, లేటు వయసులో పెళ్లిపై సుబ్బరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పెళ్లి అవ్వడం వేరు చేసుకోవడం వేరు .. ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకోవాలి, పెళ్లి జరగకూడదు. నేను చాలామందిని అడిగితే ... 25 ఏళ్లు వచ్చేశాయి పెళ్లి చేసుకోవాలి, అందరికీ ఆయిపోతే నాకు అయిపోవాలి. మా పేరెంట్స్ ప్రెజర్ చేసుకోవాలి. పెళ్లి చేసుకుంటే నాకిది వస్తుంది అంటే అది పెళ్లే కాదు. నువ్వు ఇవ్వగలగడం అనేది పెళ్లి. నేను చూసిన వాటిలో ఎన్నో పెళ్లిళ్లు ఫెయిల్ అవ్వడానికి కారణం ఇదే. భాగస్వామిపై భారీ అంచనాలే దీనికి కారణం. నా మొగుడు ఇలా ఉండాలి, లేదా నా భార్య ఇలా ఉండాలి. సో.. నీకు అలాంటి వాళ్లు రాకపోతే నీకు వ్యతిరేకత వచ్చేస్తుంది. నేను లైఫ్ లాంగ్ ఇవ్వాలి అనే మనస్తత్వం బహుశా నాకు రాలేదేమో. నా జీవితం, సర్వస్వం నా భార్యకు జీవితాంతం ఇవ్వాలన్న ఫీలింగ్ వస్తే ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకుంటా. ఒక అమ్మాయి జీవితంలోకి నువ్వు వెళ్లినప్పుడు నువ్వు పెట్టుకున్న ఆశలు పరిపూర్ణం కాకపోతే విడాకులే. నీకు కాబోయే భార్య ఇలా ఉండాలని కొన్ని ఊహించుకుంటావు.. అలాంటిది నీకు దక్కకపోతే విడాకులు ఖాయం. ప్రేమ అనే కాదు ఏ రిలేషన్‌ అయినా తెగిపోవాల్సిందేనని సుబ్బరాజు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: baahubali 2 subbaraju prabhas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X