SSMB29 మహేష్ బాబు మూవీ 3 ఏళ్ల తర్వాతే .. జక్కన్న ప్లానింగే వేరబ్బా.. బాహుబలి నిర్మాత క్లారిటీ

ఆర్కా మీడియా వర్క్స్, డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ కాంబినేషన్ లో వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ "యక్షిణి". ఈ వెబ్ సిరీస్ ను శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. వేదిక, మంచు లక్ష్మి, రాహుల్ విజయ్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు తేజ మార్ని "యక్షిణి" సిరీస్ ను రూపొందిస్తున్నారు. జూన్ 14న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో "యక్షిణి" వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ రోజు "యక్షిణి" వెబ్ సిరీస్ ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా నిర్మాత ప్రసాద్ దేవినేని మాట్లాడుతూ..

పరంపర తర్వాత డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ తో కలిసి మేము చేస్తున్న రెండో సిరీస్ ఇది. రొమాన్స్, కామెడీ, డ్రామా వంటి అంశాలతో యక్షిణి ఆకట్టుకుంటుంది. డిస్నీ మాకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చిందో మేము బడ్జెట్ విషయంలో యక్షిణి టీమ్‌కు అంత ఫ్రీడమ్ ఇచ్చాం. ఈ సిరీస్ పూర్తిగా దర్శకుడు తేజ మార్ని విజన్ అని చెప్పాలి. మా ఆర్కా టీమ్‌కు, డిస్నీ టీమ్‌కు థ్యాంక్స్ చెబుతున్నా. యక్షిణిలో మంచి కాస్టింగ్ ఉన్నారు. వారంతా సూపర్బ్‌గా పర్ ఫార్మ్ చేశారు. యక్షిణి పరంపరను మించిన సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాం. యక్షిణి సీజన్ 2 కోసం కూడా ప్లానింగ్ మొదలుపెట్టాం అని అన్నారు.

Baahubali Producer Devineni Prasad clarity on SS Rajamouli and Mahesh Babu s SSMB29 project in Yakshini Promotional Event

ఇక బాహుబలి సినిమా తర్వాత ఆ రేంజ్‌లో మూవీని నిర్మించలేకపోవడానికి కారణం ఓటీటీ మంచి వేదికగా అనిపించింది. గ్రాండియర్ వేలో కథను చెప్పడానికి రాజీ లేకుండా ఓటీటీలోనే సాధ్యమవుతుంది. ఇంతకు ముందు పరంపర, ఇప్పుడు యక్షిణి వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను అందించబోతున్నాం అని ప్రసాద్ దేవినేని తెలిపారు.

ఇక బాహుబలి తర్వాత ఎస్ ఎస్ రాజమౌళితో సినిమా చేయలేకపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. అయితే మా ప్రాజెక్టు గురించి ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతున్నాయి. మేమంత ఒక ఫ్యామిలీ. మేమంత కలిసే ఉంటాం. మా ఫ్యూచర్ ఫ్రాజెక్ట్ కోసం రకరకాల చర్చలు నడుస్తూనే ఉంటాయి. త్వరలోనే మా నుంచి ప్రాజెక్టు ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు అని దేవినేని ప్రసాద్ చెప్పారు.

Baahubali Producer Devineni Prasad clarity on SS Rajamouli and Mahesh Babu s SSMB29 project in Yakshini Promotional Event

ఇక మహేష్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి సినిమా SSMB29 గురించి చిన్న విషయాన్ని ఆయన షేర్ చేసుకొంటూ.. ఆ మూవీ ముగిసే సమయానికి మూడేళ్లు పడుతుంది. ఆ మూడేళ్ల తర్వాత ఏదైనా ఆర్కా మీడియాతో ఓ ప్రాజెక్టు ఉండటానికి అవకాశం ఉంది అని అన్నారు. అయితే మూడేళ్ల వరకు మహేష్ బాబు ఇక జక్కన్న ప్రాజెక్టుతో ఫిక్స్ అని ఆయన చెప్పకనే చెప్పారు. ఇక మహేష్ బాబు ప్రేక్షకులకు తక్కువలో తక్కువ 2025లో గానీ.. 2026లో గానీ రాజమౌళి సినిమాతో కనిపించవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X