Baahubali reunion: బాహుబలి పదేళ్ల వేడుక.. ప్రభాస్ పక్కన కనిపించని అనుష్క, తమన్నా?

తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన చిత్రం బాహుబలి. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించించిన ఈ సినిమా టాలీవుడ్ స్టాయిని పెంచడంతో పాటు పాన్ ఇండియా కల్చర్‌ను భారతీయ చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది. ఈ దెబ్బతో సౌత్ సినిమాలు బాలీవుడ్ మీదకి దండయాత్ర మొదలుపెట్టాయి. రెండు భాగాలుగా తెరకెక్కిన బాహుబలి ది బిగినింగ్ .. 2015 జూలై 10 విడుదలై సంచలనం సృష్టించింది. భారతీయ సినీ పరిశ్రమలో అప్పటి వరకు ఉన్న పలు రికార్డులను ఊచకోత కోయడంతో పాటు ప్రభాస్‌ను పాన్ ఇండియా స్టార్‌ను చేసింది.

650 కోట్లతో సంచలనం
ఈ చిత్రంలో ప్రభాస్ అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలిగా రెండు గెటప్స్‌లో కనిపించారు. దేవసేనగా అనుష్క, అవంతికగా తమన్నా భాటియా, భల్లాలదేవగా రానా దగ్గుబాటి, కట్టప్పగా సత్యరాజ్, శివగామిగా రమ్యకృష్ణ నటించారు. ఈ చిత్రాన్ని ఆర్క మీడియా వర్క్స్ పతాకంపై దాదాపు 180 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలు నిర్మించారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చగా.. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథను అందించారు. థియేట్రికల్ రన్ ముగిసేసరికి బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.650 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.

Baahubali reunion Anushka Shetty Tamannaah Bhatia missing at Baahubali 10 years celebrations

కట్టప్ప వెన్నుపోటుతో భారీ హైప్
ఈ సినిమా చివరిలో బాహుబలిని కంటికి రెప్పలా చూసుకునేలా కట్టప్ప.. వెన్నుపోటు పొడవటం పెద్ద మిస్టరీగా మారింది. వై కట్టప్ప కిల్ బాహుబలి అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో డిస్కషన్స్ నడవటంతో పాటు దీనిపై రకరకాల స్పూఫ్స్ ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టాయి. ఏకంగా రాజకీయాల్లోనూ కట్టప్ప పేరు మారుమోగిపోయింది. బాగా నమ్మకస్తుడైన వ్యక్తి వెన్నుపోటు పొడిస్తే అతనిని కట్టప్పగా వ్యవహరించడం మొదలుపెట్టారు. కట్టప్ప వెన్నుపోటు కారణంగా బాహుబలి 2పై అంచనాలు పెరిగిపోయాయి. పార్ట్ 2లో ఏం జరిగిందో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ థియేటర్లకు పరుగులు తీశారు.

కలెక్షన్స్‌లలో బాహుబలి 2 రికార్డ్
అనంతరం 28 ఏప్రిల్ 2017న విడుదలైన బాహుబలి 2 బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. 250 కోట్లతో తెరకెక్కిన రెండో భాగంగా ఏకంగా 1810 కోట్లకు వసూళ్లు సాధించింది. అత్యధిక కలెక్షన్స్ సాధించిన భారతీయ సినిమాల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. తాజాగా ఈ జూలై 10తో బాహుబలి విడుదలై 10 ఏళ్లు కావొస్తున్న సందర్భంగా బాహుబల్ పార్ట్ 1, బాహుబలి పార్ట్ 2 రెండూ కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు రాజమౌళి వెల్లడించారు.

బాహుబలికి పదేళ్లు
బాహుబలి విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా చిత్ర యూనిట్ మొత్తం మరోసారి కలిసింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్, రానా, కీరవాణి, శ్రీవల్లి, రమా రాజమౌళి, రాజమౌళి, కార్తీకేయ, నాజర్, రమ్యకృష్ణ, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని వీరిలో ఉన్నారు. అయితే దేవసేన అనుష్క శెట్టి, అవంతికగా చేసిన తమన్నా భాటియాలు ఈ సెలబ్రేషన్స్‌లో కనిపించకపోవడం అనేక అనుమానాలు కలిగిస్తోంది.

పదేళ్ల వేడుకలో కనిపించని అనుష్క, తమన్నా
అనుష్క ప్రస్తుతం బాగా బరువు పెరిగిపోయి బయటకు పెద్దగా రావడం లేదు. ప్రస్తుతం నటిస్తోన్న ఘాటి షూటింగ్స్‌లో మాత్రం పాల్గొంటున్నారు. సైజ్ జీరో నుంచి ఎదుర్కొంటున్న సమస్యలు ఎక్కువ కావడం కూడా ఆమె బాహుబలి రీ యూనియన్‌లో కనిపించకపోవడానికి కారణం అంటున్నారు. కానీ ఇందులో ఎంత వరకు నిజముందో తెలియదు. అటు తమన్నా విషయానికి వస్తే.. విజయ్ వర్మతో బ్రేకప్ తర్వాత ఆమె కూడా పెద్దగా బయటకు రావడం లేదు. తన సినిమాలు, షూటింగ్స్‌కే పరిమితం అవుతున్నారు. కానీ అనుష్క, తమన్నా కనిపించకపోవడం ప్రభాస్ అభిమానులను నిరాశకు గురిచేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X