'బాహుబలిని కట్టప్ప చంపాలనే ఐడియా నాది కాదు..' పదేళ్ల తరువాత బయటపెట్టిన రాజమౌళి

Baahubali Secret Revealed: 'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?' ఈ ఒక్క ప్రశ్న ఇండియన్ సినిమా హిస్టరీలో బిగ్గెస్ట్ మిస్టరీగా నిలిచిపోయింది. 2015లో విడుదలైన 'బాహుబలి: ది బిగినింగ్' సినిమా చివర్లో వచ్చిన ఆ ఒక్క ట్విస్ట్ మొత్తం దేశాన్ని షాక్‌కి గురి చేసింది. "వెన్నుపోటు... నేనే చంపాను" అనే కట్టప్ప మాటతో ఆ సినిమా ముగియడంతో, థియేటర్ల నుంచి బయటకు వచ్చినా ప్రతి ప్రేక్షకుడి మదిలో .. అదే ప్రశ్న ఉండిపోయింది. ఆ ఒక్క సీన్ సినిమాను లెజెండరీ స్థాయికి తీసుకెళ్లింది. ఈ సూపర్ క్లైమాక్స్ సీన్ వెనుక ఉన్న అసలు విషయాన్ని తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి బయటపెట్టారు. అసలు ఆ ఆలోచన తనది కాదని రాజమౌళి స్వయంగా వెల్లడించారు. ఇంతకీ ఆ ఆలోచన ఎవరిది? క్లైమాక్స్ ను అలా తెరకెక్కించడానికి కారణమేంటీ? అనే వివరాల్లోకెళ్లే..

'బాహుబలి: ది ఎపిక్' రీ రిలీజ్ ప్రమోషన్స్‌లో భాగంగా రాజమౌళి, ప్రభాస్, రానా కలిసి చేసిన ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికర విషయం బయటపడింది. మొదట రాజమౌళి ప్లాన్ చేసిన ఎండింగ్ పూర్తిగా భిన్నంగా ఉందట. రాజమౌళి ఆలోచన ప్రకారం.. 'బాహుబలి: ది బిగినింగ్' సినిమా యుద్ధ సన్నివేశం ముగిసిన తర్వాత కాలకేయుడిని ఓడించిన బాహుబలిని మాహిష్మతికి రాజుగా ప్రకటించే సన్నివేశంతో సినిమా ముగియాలనీ, ఫస్ట్ పార్ట్ హ్యాపీ ఎండింగ్‌తో క్లోజ్ ఇవ్వాలని,సెకండ్ పార్ట్‌లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే రహస్యాన్ని రివీల్ చేయాలనే ఆలోచన రాజమౌళికి ఉందట.

Baahubali Secret Revealed Rajamouli Says Kattappa Killing Baahubali Twist Was Keeravani s Idea

అయితే, స్క్రిప్ట్‌లో అప్పటికే ఒక చిన్న కీలకమైన సీన్ ఉంది. అదే సుదీప్ పోషించిన అస్లాం ఖాన్ పాత్ర కట్టప్పతో మాట్లాడే సీన్. ఆ సన్నివేశంలో అస్లాం ఖాన్, "నీ కంటే గొప్ప వీరుడు బాహుబలి ఎలా చనిపోయాడు?" అని అడిగితే, కట్టప్ప ప్రశాంతంగా, "వెన్నుపోటు... నేనే చంపాను" అని సమాధానం ఇస్తాడు. ఈ సీన్‌పై రాజమౌళి, ఆయన టీమ్ డిస్కషన్ చేస్తుండగా రాజమౌళి అన్నయ్య కీరవాణి (పెద్దన్న) మధ్యలో ఒక సలహా ఇచ్చారు.

"ఇంత బలమైన లైన్ ఉన్నప్పుడు దాన్ని మధ్యలో వదిలేయకండి. అదే సీన్‌ను సినిమా చివర్లో పెట్టండి. కట్టప్ప బాహుబలిని చంపిన సీన్‌తో సినిమా ముగిస్తే, అది ఇండియన్ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ క్లిఫ్‌హ్యాంగర్ అవుతుంది" అని కీరవాణి సలహా ఇచ్చారట. మొదట రాజమౌళి కొంచెం సందేహపడినా.. తర్వాత ఆ ఆలోచన సరిగ్గా అనిపించి అంగీకరించారు. ఆ చిన్న మార్పు సినిమా రేంజ్‌ని పూర్తిగా మార్చేసింది. ఆ సీన్‌నే బాహుబలి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది.

రాజమౌళి ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ మాట్లాడుతూ "థియేటర్లో సినిమా అయిపోయినా జనాలు లేవట్లేదు.ఎండ్ టైటిల్స్ పడుతున్నా అలాగే కూర్చున్నారు. ఏదో ఇంకో సీన్ వస్తుందేమోనని వెయిట్ చేశారు. వేరే వాళ్లు చెప్పితే కానీ, ప్రేక్షకుల లేవకుండా కూర్చున్నారు. ఎండ్ లో చప్పట్లు, స్టాండింగ్ ఓవేషన్స్. అప్పుడు మాకు అర్థమైంది. ఆ సీన్ ఆడియెన్స్ మైండ్‌లో సరిగ్గా హిట్ అయిందో " అని చెప్పారు.ఆ ఒక్క సన్నివేశం వల్లే బాహుబలి సినిమాకు ఎక్కడలేని హైప్ వచ్చింది. రెండు సంవత్సరాల పాటు దేశం మొత్తం "కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?" అనే ప్రశ్నతో ఊగిపోయింది. ఆ ఒక్క క్లిఫ్‌హ్యాంగర్ సినిమా ప్రమోషన్‌కి సెంటర్ పాయింట్ అయింది. రియాలిటీ షోలు, మీమ్స్, సోషల్ మీడియా పోస్ట్‌లు ఎక్కడ చూసినా అదే ప్రశ్న ట్రెండ్ అయ్యింది.

అంతటి ఐడియా ఇచ్చిన కీరవాణికి ఇప్పుడు సినీ అభిమానులు, విమర్శకులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఆయన ఆలోచన లేకపోయి ఉంటే బాహుబలి సినిమా ఇంతటి సంచలనాన్ని సృష్టించేదేమో అనే అనుమానం తలెత్తుతోంది. రాజమౌళి కూడా కీరవాణి ఐడియాను అద్భుతంగా అమలు చేసి, దానికి విజువల్ మేజిక్ జోడించి ఆ సీన్‌ను ప్రపంచస్థాయి క్లాసిక్‌గా మార్చాడు. ఇప్పుడు రాజమౌళి స్వయంగా ఈ రహస్యాన్ని బయటపెట్టడంతో,"కట్టప్ప బాహుబలిని చంపాడు" అనే క్లైమాక్స్ వెనుక ఉన్న నిజమైన మేథావి కీరవాణేనని ప్రశంసిస్తున్నారు. ఆయన ఇచ్చిన ఆ ఒక్క సలహా బాహుబలి సినిమాను కేవలం ఒక బ్లాక్ బస్టర్ మూవీగా కాకుండా, ఒక లెజెండరీ ఫ్రాంచైజీగా నిలబెట్టింది. మొత్తానికి రాజమౌళి విజన్‌, కీరవాణి ఆలోచనతో సృష్టించబడిన అద్భుతమే బాహుబలి అని ఫ్యాన్ కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Read more about: baahubali ss rajamouli keeravani
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X