ఆయన్ని నేనే చంపేస్తా.. రానా దగ్గుబాటి డైరెక్ట్ వార్నింగ్
టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గు బాటి బాహుబలి చిత్రంతో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో తెలిసిందే. రానా తన చిత్రాలు, ముఖ్యంగా తోటీ నటీనటులకు, యంగ్ టాలెంట్ ను ప్రోత్సహించడంలో మంచి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పటికీ తన వల్లైనంత మేరకు ఇతరులకు సాయం చేస్తూనే ఉంటారు. ఇక తెలుగు సినిమా క్రేజ్ ను విదేశాల్లో మరింతగా వ్యాప్తి చేసేందుకు తనవంతుగా కృషి చేస్తూనే ఉన్నారు. మరోవైపు రానా దగ్గుబాటిని చిత్ర పరిశ్రమలో అందరూ ప్రేమించే వారు, గౌరవించే వారే ఎక్కువగా ఉండటం విశేషం. ఇదిలా ఉంటే రానా దగ్గుబాటి తాజాగా 'ఆయన్ని నేనే చంపేసే వాడిని' అంటూ స్పందించడం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్..
రానా దగ్గుబాటి లీడర్ చిత్రంతో తొలిసారిగా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించి మెప్పించారు. కానీ బాహుబలి చిత్రంతో మాత్రం ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా నటించిన బాహుబలి చిత్రాన్ని వరల్డ్ వైడ్ ప్రమోట్ చేశారు. ఈ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ చిత్రం తర్వాత రానా దగ్గుబాటి పేరు ఇండియాలో మారుమోగింది.

బాహుబలి రీరిలీజ్..
ప్రస్తుతం టాలీవుడ్ లో రీరిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో బాహుబలి రీరిలీజ్ ఎప్పుడు ఉంటుందంటూ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో బాహుబలి రిలీజ్ అయ్యి 10 ఏళ్లు పూర్తైన సందర్భంగా రీరిలీజ్ ను అనౌన్స్ చేశారు. అక్టోబర్ 31న బాహుబలి చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాలు వరుసగా 2015, 2017లో విడుదలై ఇండియాతో పాటు వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేశారు. త్వరలో బాహుబలి ది ఎపిక్ గా రీరిలీజ్ కాబోతోంది.
ఈ సందర్భంగా బాహుబలి ది ఎపిక్ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో బాహుబలి ఎక్స్ అఫీషియల్ అకౌంట్ ద్వారా ఇంట్రెస్టింగ్ పోస్టులను పెడుతున్నారు. తాజాగా మాత్రం బాహుబలిని కట్టప్ప చంపకపోతే ఏం జరిగేది? అంటూ ఆడియెన్స్ ను ఎంగేజ్ చేయడానికి ప్రశ్నను వదిలారు. దీనికి స్వయంగా రానా దగ్గుబాటి స్పందించారు. 'అతనికి బదులుగా నేనే చంపేసే వాడిని' అంటూ రిప్లై ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. రానా ఫన్నీ రియాక్షన్ కు నెటిజన్లూ ఫిదా అవుతున్నారు.
బాహుబలి ది ఎపిక్ వివరాలు..
శోభు యార్లగడ్డ, ప్రసాద్ లు నిర్మాతలుగా బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాలను ఆర్కా మీడియా బ్యానర్ లో నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలు కలిపి 2500 కోట్ల రూపాయాలకు పైగా బాక్సాఫీస్ వద్ద గ్రాస్ వసూళ్లు సాధించారు. ఇక ఈ రెండు చిత్రాలను కలిపి బాహుబలి ది ఎపిక్ గా రీరిలీజ్ చేయబోతున్నారు. 3.50 నిమిషాల పాటు నిడివి వచ్చేలా రాజమౌళినే దగ్గరుండి ఎడిట్ చేయబోతున్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











