’మెగాస్టార్ కోసం నా చేయి కోసుకుంటా.. కానీ ఒక్కటే రిక్వెస్ట్’

మెగాస్టార్ చిరంజీవికి ఏ రేంజ్ లో అభిమానులు ఉంటార్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 1978 నుంచి ఇప్పటి వరకు నాలుగు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. మూడు జనరేషన్ల కు హీరోగా నిలిచారు. అసలు టాలీవుడ్ లో చిరంజీవి ఎంట్రీ తర్వాత చాలా మార్పులు వచ్చాయని, తెలుగు చిత్ర పరిశ్రమను చిరంజీవికి ముందు చిరంజీవి తర్వాత అని సినీ ప్రముఖులే అభివర్ణించారంటే అతిశయోక్తి కాదు. ఆ స్థాయిలో చిరంజీవి సినిమా కోసం కష్టపడే వారు. ఈ క్రమంలోనే డ్యాన్స్, యాక్షన్, విభిన్న పాత్రలు, వ్యక్తిగత విషయంలోనూ అదరగొట్టి మెగాస్టార్ గా ఎదిగారు.

ఇలా మెగాస్టార్ చిరంజీవికి రెండు తెలుగు రాష్ట్రాల్లో విశేషమైన అభిమానులు ఉన్నారు. అంతే కాదు సినిమా ఇండస్ట్రీలోనూ సగానికి పైగా అన్నయ్యకు అభిమానులే. ఇదిలా ఉంటే.. చిరంజీవిపై ప్రముఖ నటుడు, హీరో, విలన్ బబ్లూ పృథ్వీరాజ్ తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బబ్లూ పృథ్వీరాజ్ మెగాస్టార్ చిరంజీవిపై తనకున్న ప్రేమ అభిమానాన్ని ఇలా పంచుకున్నారు. బబ్లూ పృథ్వీ రాజ్ మాట్లాడుతూ.. చిరంజీవి అంటే పిచ్చి ప్రాణం. ఆయనపై నా కెరియర్ ప్రారంభమైనప్పటికీ నుంచి అభిమానం ఇంకా పెరుగుతూనే వస్తోంది.

Babloo Prithiveeraj Request to Megastar Chiranjeevi

నాకు చిరంజీవి గారు అంటే ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేను. కానీ చిరంజీవి అడిగితే మాత్రం నా కుడి భుజం కోసి ఇచ్చేస్తాను. అలాగే మెగాస్టార్ తో నా కెరియర్ లో ఒక్కసారైనా స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఎదురుచూస్తున్నాను. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న మెగా157 ప్రాజెక్ట్ లో ఒక్క నిమిషం పాత్ర ఇచ్చిన చేస్తాను. అనిల్ రావిపూడికి ఇది నా రిక్వెస్ట్ కూడానూ. ఎప్పటి నుంచో చిరంజీవి గారితో కలిసి నటించాలని ప్రయత్నించాను. కానీ ఎప్పుడూ అవకాశం రాలేదు. ఇప్పుడువస్తే మాత్రం తప్పకుండా చేస్తాను... అని బబ్లూ పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు.

ఇక బబ్లూ పృథ్వీ రాజ్ 'యానిమల్' చిత్రం తర్వాత మళ్లీ ఫామ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు దర్శకుడు, డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డివంగ దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రంతో బబ్లూ పృథ్వీరాజ్ తిరిగి అవకాశాలను అందుకుంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా బబ్లూ పృథ్వీ రాజ్ నే యానిమల్ సినిమా రిలీజ్ తర్వాత చెప్పడం విశేషం. యానిమల్ లో ఆయన విలన్ పాత్రలో నటించి అదరగొట్టారు. ఆయన పెర్ఫామెన్స్ కు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఆ తర్వాత ఏకంగా 30 సినిమాల్లో పృథ్వీరాజ్ కు అవకాశాలు వచ్చాయని తానే చెప్పారు. రీసెంట్ గా 'సంక్రాంతికి వస్తున్నాం', 'తండేల్' వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు.

ఇదిలా ఉంటే బబ్లూ పృథ్వీ రాజ్ 58 ఏళ్ల వయస్సుల్లో ఫిట్ నెస్ తో అదరగొడుతున్నారు. 1985 నుంచి చిత్ర పరిశ్రమలో బబ్లూ పృథ్వీ రాజ్ చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. తమిళ చిత్రాల్లో తొలుత సపోర్టింగ్ రోల్స్ లో అవకాశాలు దక్కించుకుంటూ వచ్చారు. టాలీవుడ్ హీరో వడ్డె నవీన్ నటించిన హిట్ చిత్రం 'పెళ్లి'తో బబ్లూ పృథ్వీ రాజ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. పెళ్లి పందిరి, కంటే కూతురినే కను, దీర్ఘ సుమంగలి భవ, సమరసింహా రెడ్డి, సమక్క సారక్క, ప్రేయసి రావే, దేవుళ్లు, బాచి, సంతోషం, చెన్నకేశవరెడ్డి, గౌతమ్ ఎస్ఎస్సీ వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X