విశ్వక్ సేన్ కి అటిట్యూడ్ ఎక్కువ.. అతనితో అలాంటి ఘర్షణ.. బబ్లూ పృథ్వీరాజ్
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ గురించి ఈతరం తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంటున్నారు. ముఖ్యంగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడంలో ఇండస్ట్రీలో వంద శాతం సక్సెస్ అయ్యాడు. యూత్ కు నచ్చే, మెచ్చే సినిమాలు చేస్తూ మరింతగా ఫాలోయింగ్ పెంచుకుంటూ వెళ్తున్నారు. మాస్ ఆడియెన్స్ కు ఫేవరేట్ హీరోగా మారుతున్నారు. మరోవైపు రోటీన్ కు భిన్నంగానూ సినిమాలు చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.
మాస్ కా దాస్ అనే బిరుదును కూడా అందుకున్న విశ్వక్ సేన్ సినీ ప్రముఖుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి వంటి ఇండస్ట్రీ పెద్దలు కూడా అతనిని ప్రోత్సహిస్తుండటం విశేషం. వారిచ్చే ఉత్సాహంతో విశ్వక్ సేన్ ఇంకా మంచి సినిమాలు చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే చివరిగా విశ్వక్ సేన్ చివరిగా 'లైలా' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

లైలా చిత్రం 2025 ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే కానుకగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా అలరించింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గరిపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. లియోన్ జేమ్స్ అద్బుతమైన సంగీతాన్ని అందించారు. అయితే ఈచిత్రంలో బబ్లూ పృథ్వీరాజ్ ఇన్పెక్టర్ శంకర్ అనే పాత్రలో అద్బుతంగా నటించారు. ఈ మూవీ ప్రమోషన్స్ ను జోరుగానే నిర్వహించిన ఎందుకో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కమర్షియల్ గానూ బాగానే దెబ్బ తగిలింది.
అయితే లైలా సినిమా గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో బబ్లూ పృథ్వీరాజ్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడారు. లైలా సినిమా అద్భుతమైన సినిమా అన్నారు. కానీ మీడియాలో విశ్వక్ సేన్ మాట్లాడిన కొన్ని మాటల వల్లనే కాస్తా ఎక్కువగా నెగెటివ్ ప్రచారం జరిగిందనేది నా అభిప్రాయం. విశ్వక్ సేన్ కు అటిట్యూడ్ ఎక్కువని, దాని వల్ల సినిమా డ్యామేజ్ అయ్యిందని ప్రచారం వినిపించింది అంటూ చెప్పుకొచ్చారు. లేదంటే మూవీకి మంచి రెస్పాన్స్ దక్కేదన్నారు. ఏదేమైనా విశ్వక్ సేన్ మళ్లీ కంబ్యాక్ ఇస్తానని ఇప్పటికే తన అభిమానులను హామీనిచ్చారు. ఇక అదే పనిలో నిమగ్నమై ఉన్నారు. నెక్ట్స్ ఫంకీ, విశ్వక్ సేన్ 13వ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఇక బబ్లూ పృథ్వీ రాజ్ రీసెంట్ గా 'సంక్రాంతికి వస్తున్నాం', 'తండేల్' వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. 58 ఏళ్ల వయస్సులోనూ ఆయన ఫిట్ నెస్ తో అదరగొడుతున్నారు. 1985 నుంచి చిత్ర పరిశ్రమలో బబ్లూ పృథ్వీ రాజ్ చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. తమిళ చిత్రాల్లో తొలుత సపోర్టింగ్ రోల్స్ లో అవకాశాలు దక్కించుకుంటూ వచ్చారు. టాలీవుడ్ హీరో వడ్డె నవీన్ నటించిన హిట్ చిత్రం 'పెళ్లి'తో బబ్లూ పృథ్వీ రాజ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. పెళ్లి పందిరి, కంటే కూతురినే కను, దీర్ఘ సుమంగలి భవ, సమరసింహా రెడ్డి, సమక్క సారక్క, ప్రేయసి రావే, దేవుళ్లు, బాచి, సంతోషం, చెన్నకేశవరెడ్డి, గౌతమ్ ఎస్ఎస్సీ వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు.


Click it and Unblock the Notifications











