చంద్రబాబు బయోపిక్.. ఫస్ట్ లుక్ విడుదల

By Rajababu

టాలీవుడ్‌లో ప్రస్తుతం బయోపిక్ నిర్మాణం ట్రెండ్‌గా మారింది. ఇప్పటికే సావిత్రి జీవిత కథ ఆధారంగా మహానటి బ్లాక్‌బస్టర్‌గా నిలవగా, రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన మహానేతలు ఎన్టీఆర్, వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు బయోపిక్‌లు చిత్రీకరణ దశలొ ఉన్నాయి. తాజాగా చంద్రబాబు నాయుడు జీవిత కథను పి.వెంకటరమణ దర్శకత్వంలొ జీజే రాజేంద్ర నిర్మిస్తున్నారు. మోహన శ్రీజ సినిమాస్, శ్వేతార్క గణపతి ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను సెప్టెంబర్ 1న విడుదల చేశారు.

Babu Biopic first look released

దర్శకుడు వెంకటరమణ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు లివింగ్ లెజెండ్. దేశ చరిత్రలొనె ఆయనొక అరుదైన, ఆదర్శవంతమైన నాయకుడు. ఓ సామాన్య కుటుంబంలో పుట్టి అగ్ర స్దానానికి ఎదిగిన ఆయన జీవితం అందరికీ తెలియచెప్పాలనే సంకల్పంతో బాబు బయోపిక్ ను తెరమీదకు తీసుకువస్తున్నాం. ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తిచేశాం అని అన్నారు.

వినోద్ నువ్వుల చంద్రబాబు నాయుడు పాత్రలో నటిస్తున్నాడు. భాస్కర్ ఎన్టీఆర్‌గా కన్పిస్తారు. చంద్రబాబు నాయుడు చిన్నతనం నుంచి ఆయన రాజకీయ నాయకుడిగా ఎదిగిన క్రమాన్ని ఈ బయోపిక్ లో చూపిస్తామని వెంకటరమణ తెలిపారు.

Babu Biopic first look released

నిర్మాత రాజేంద్ర మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి ఈ సెప్టెంబర్ 1 తేదీకి 23 సంవత్సరాలు అయింది. ఈ సందర్బంగా మా చిత్ర ఫస్ట్‌లుక్ పొస్టర్‌ను విడుదల చేశాం. త్వరలొనె సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని అన్నారు.

వినోద్ నువ్వుల, శివానీ చౌదరి, మౌనిక , భాస్కర్ తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి డిఓపి: కార్తీక్ ముకుందన్, సంగీతం: రాజ్ కిరణ్, పి.ఆర్, మార్కెటింగ్: వంశీ చలమలశెట్టి, నిర్మాత : జి.జె.రాజేంద్ర, దర్శకత్వం: పి.వెంకటరమణ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X