బాలకృష్ణ మొనగాడు.. చిరంజీవి, గిరంజీవి పనికిరాడు: బాబు మోహన్ సెన్సేషనల్ కామెంట్స్

Recommended Video

Babu Mohan's Comment On Balayya Goes Viral || గుర్రం స్వారీ చెయ్యడంలో బాలయ్య మొనగాడు

వెండితెరపై హాస్యనటుడుగా ఓ వెలుగు వెలిగాడు బాబు మోహన్. అందరు అగ్ర హీరోల సినిమాల్లో నటించి కమెడియన్‌గా మంచి పాపులారిటీ తెచ్చుకున్న ఆయన క్రమంగా వెండితెరకు దూరమై రాజకీయాల్లో స్థిరపడ్డారు. రాజకీయ పరంగా పలు హోదాల్లో పనిచేసిన ఆయన.. తాజాగా హీరోలు బాలకృష్ణ, చిరంజీవిలపై కామెంట్ చేయడం దుమారం రేపుతోంది. బాబు మోహన్ మాట్లాడిన తీరు పలు చర్చలకు దారితీస్తోంది. ఆ వివరాలు చూద్దామా..

మొదటి నుంచే బాబు మోహన్..

మొదటి నుంచే బాబు మోహన్..

సాధారణం గానే కమెడియన్, మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్‌కి కాస్త నోటి దురుసు ఎక్కువ. తాను చెప్పాలనుకున్నది వెంటనే చెప్పేయడం ఎన్నో సందర్భాల్లో చూసాం. అదే బాటలో ఈ సారి బాలకృష్ణ గురించి మాట్లాడుతూ చిరంజీవి, గిరంజీవి అనేశాడు బాబు మోహన్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

అప్పట్లో సినిమా షూటింగ్.. బాలకృష్ణను చిరంజీవితో పోల్చుతూ

అప్పట్లో సినిమా షూటింగ్.. బాలకృష్ణను చిరంజీవితో పోల్చుతూ

బాలకృష్ణ హీరోగా వచ్చిన భైరవద్వీపం సినిమా షూటింగ్ రోజులను గుర్తు చేసుకుంటూ నందమూరి బాలకృష్ణపై కొన్ని కామెంట్స్ చేశాడు బాబుమోహన్. అయితే ఈ మాటల్లో బాలకృష్ణను చిరంజీవితో పోల్చడం ఆసక్తికర అంశంగా మారింది. దీంతో ఈ వీడియో మెగా, నందమూరి అభిమానుల సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

బాలకృష్ణలా ఎవ్వరూ చేయలేరు

బాలకృష్ణలా ఎవ్వరూ చేయలేరు

‘‘భైరద్వీపంలో బాలకృష్ణ, నేను గర్రాలపై వెళ్తాం. గుర్రం స్వారీ చేయడంలో బాలకృష్ణ మొనగాడు. గుర్రాలతో అతను ఓ ఆట ఆదుకుంటాడు. వాటి మీదికి ఎగిరి దూకుతుంటాడు. నిజంగా చెప్పాలంటే బాలకృష్ణలా ఎవ్వరూ.. చిరంజీవి, గిరంజీవి ఎవ్వరూ గుర్రం నడపలేరు. అసలు ఏం పట్టుకోకుండా ఉత్తగా జూలు పట్టుకుని పోతుంటాడు బాలకృష్ణ'' అని అన్నాడు బాబు మోహన్.

మెగా, నందమూరి వర్గాల్లో హాట్ టాపిక్

గతంలో చాలా సందర్బాల్లో చిరంజీవి గురించి గొప్పగా చెప్పిన బాబూ మోహన్.. ఇప్పుడు బాలకృష్ణ గురించి మాట్లాడుతూ ఆయన్ను పోల్చడం మెగా, నందమూరి వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. పైగా ఇటీవలే సైరా నరసింహా రెడ్డి సినిమాలో గుర్రంపై చిరంజీవి స్వారీ చేయడం, ఈ టైమ్‌లో బాబు మోహన్ ఇలా చిరంజీవి, గిరంజీవి అని మాట్లాడుతున్న వీడియో బయటకు రావడం మెగా అభిమానుల్లో ఆవేషం నింపుతోంది.

చిరంజీవి, బాలకృష్ణ సిల్వర్ స్క్రీన్ జోష్

చిరంజీవి, బాలకృష్ణ సిల్వర్ స్క్రీన్ జోష్

టాలీవుడ్ సీనియర్ హీరోలుగా చిరంజీవి, బాలకృష్ణ సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటుతూనే ఉన్నారు. చిరంజీవి ప్రస్తుతం తన 152 వ సినిమా కోసం రెడీ అవుతుండగా, బాలకృష్ణ తన 105 వ సినిమాను కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X