Baby 2: ఆత్మగా మారిన ఆనంద్.. బేబీ 2 స్టోరీని లీక్ చేసిన సాయి రాజేష్... సేమ్ టు సేమ్ అంటూ పోస్ట్
చిన్న సినిమాగా రిలీజ్ అయిన బేబీ చిత్రం ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించాడు. ఎలాంటి అంచనాలు లేకుండా ఈ సినిమా రిలీజ్ అయి.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దాదాపు రూ.100కోట్ల సాధించింది ఈ చిత్రం. అయితే ఇటీవల ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య మరో కొత్త సినిమా పోస్టర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇది కచ్చితంగా బేబీ 2 అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సాయి రాజేష్ బేబీ 2 సినిమా స్టోరీని లీక్ చేశాడు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బేబీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య. బేబీ సినిమాతో ఈ జంటకు విపరీతమైన క్రేజ్ అయితే వచ్చింది. దర్శకుడు సాయి రాజేశ్ తెరకెక్కించి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. విరాజ్ యాక్టింగ్ కు కూడా అందరూ ఫిదా అయిపోయారు. ఇక ఈ సినిమాకు మరో ప్లస్ సంగీతం. విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం.. ఈ చిత్రానికి మరో హైలెట్ గా నిలిచింది. బేబీ సినిమా యూత్ కు బాగా కనెక్ట్ అయింది.

ఇదిలా ఉంటే.. ఇటీవల ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య జంటగా మరో చిత్రం తెరకెక్కబోతున్నట్లు ప్రకటించారు. కలర్ ఫోటో రూపొందించిన అమృతా ప్రొడక్షన్స్ , మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఆ సినిమాను నిర్మించనున్నాయి. ఇక ఈ సినిమాకు బేబీ సినిమాకు డైరెక్టర్ గా పని చేసిన సాయి రాజేష్ కథను అందిస్తున్నాడు. అంతేకాకుండా ఈ సినిమాకు SKN తోపాటు సాయి రాజేష్ నిర్మాతగా ఉన్నారు. ఇక ఈ క్రేజీ ప్రాజెక్టుకు రవి నంబూరి డైరెక్షన్ చేయనున్నారు.
ఇక ఈ సినిమాను త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్లు మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేస్తు తెలిపారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని 2024 సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ చూసి అంతా బేబీ 2 అంటూ కామెంట్స్ చేశారు. అంతే కాదు సోషల్ మీడియాలో చాలా మంది బేబీ 2 కథ ఇదే అంటూ రాసుకువస్తున్నారు.

దీనిపై దర్శకుడు సాయి రాజేష్ తన సోషల్ మీడియా అకౌంట్ వేదికగా బేబీ 2 స్టోరీని లీక్ చేశాడు. తన ఇన్ స్టా స్టోరీలో వైష్ణవి, ఆనంద్ పోస్టర్ పెట్టి... ఓ సుదీర్ఘ స్టోరీని రాసుకువచ్చారు. అందులో... బేబీ చిత్రంలో ఆనంద్ చనిపోతాడు. వైష్ణవికి పెళ్లవుతుంది. ఇక వైష్ణవిపై పగపై విరాజ్ మళ్లీ ఆమె జీవితంలోకి వస్తాడు. అప్పుడు ఆనంద్ తన వైషుని కాపాడుకోవడానికి ఆత్మగా ఉన్న ఆనంద్.. వైష్ణవి భర్త బాడీలోకి వెళ్తాడు. విరాజ్ రివెంజ్ కు ఆత్మగా మారిన ఆనంద్.. ఎలా తనను సేవ్ చేస్తాడు అనేదే బేబీ 2 కథ... అంటూ సాయి రాజేష్ రాసుకువచ్చాడు.
ఇక సాయి రాజేష్ చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. బేబీ 2 స్టోరీ సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. దర్శకుడు ఫన్నీ పోస్టుతో... ఇక ఇప్పుడు నిజంగానే బేబీ 2 తీస్తున్నారనే సందేహాలు కలుగుతున్నాయి. చాలా మంది బేబీ 2 తీస్తే బాగుంటుందని సలహాలు కూడా ఇస్తున్నారు. చూడాలి మరి నిజంగానే బేబీ చిత్రానికి సీక్వెల్ తీస్తారా.. లేదా కొత్త కథతో మళ్లీ గుండెల్ని పిండేస్తారా అనేది.


Click it and Unblock the Notifications











