బేబీ, హాయ్ నాన్నకు 8 నామినేషన్స్.. హైదరాబాద్‌లో 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఎప్పుడంటే?
తెలుగు సినిమా పరిశ్రమలో ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి 100 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టిన చిత్రం బేబీ. ట్రాయంగిల్ లవ్ స్టోరిగా రూపిందిన ఈ సినిమాలో
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్‌కేఎన్ నిర్మాతగా దర్శకుడు సాయి రాజేశ్ రూపొందించారు.
బాక్సాఫీస్ వద్ద కల్ట్ బ్లాక్‌బస్టర్‌గా మారిన బేబి చిత్రం మరో చరిత్ర సృష్టించడానికి సిద్దంగా ఉంది. తాజాగా ప్రకటించిన 69 ఫిల్మ్ ఫేర్ సౌత్ 2024 అవార్డ్స్ లో బేబి సినిమాకు 8 నామినేషన్స్ దక్కాయి.

బెస్ట్ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ చిత్రం, ఉత్తమ డైరెక్టర్, ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్, ఉత్తమ గేయ రచయిత, ఉత్తమ గాయకుడు మొత్తం 8 ప్రధాన విభాగాల్లో బేబి సినిమా నామినేషన్స్ సొంతం చేసుకొన్నది. త్వరలో హైదరాబాద్‌లో జరగనున్న ఫిల్మ్ ఫేర్ సౌత్ 2024 అవార్డ్స్‌లో బేబి సినిమా చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
హృదయాన్ని కదిలిచే విధంగా విశేషమైన నటనతో ఆకట్టుకొన్న ఆనంద్ దేవరకొండ ఉత్తమ నటుడు క్యాటగిరిలో, ఉత్తమ నటి విభాగంలో వైష్ణవీ చైతన్య, ఉత్తమ చిత్రంగా, ఉత్తమ దర్శకుడిగా సాయి రాజేశ్, సంగీత దర్శకుడిగా విజయ్ బుల్గానిన్, ఉత్తమ గేయరచయితగా అనంత శ్రీరామ్ నామినేషన్స్ సాధించారు. ప్రేమిస్తున్నా పాట పాడిన పీవీఎన్ఎస్ రోహిత్, ఓ రెండు ప్రేమ మేఘాలిలా పాట పాడిన శ్రీరామ చంద్ర బెస్ట్ సింగర్స్ గా నామినేషన్ అందుకున్నారు.
బేబి సినిమాతోపాటు నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమాకు కూడా 8 నామినేషన్స్ దక్కాయి. ఈ రెండు చిత్రాల మధ్య భారీ పోటీ నెలకొన్నది. ఈ సినిమా ఎన్ని అవార్డులు గెలుచుకొంటాయనే విషయం ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











