Baby నటికి లైంగిక వేధింపులు, హత్య బెదిరింపులు.. షాకింగ్ విషయాలు చెప్పిన సీత
సినిమాలకు ఉన్నంత క్రేజ్ మరేదానికి ఉండదమో. ఎందుకంటే సినిమాల్లో పాత్రలను నిజమైన క్యారెక్టర్స్ గా భావిస్తుంటారు ప్రేక్షకులు. అందులో నటీనటుల పాత్రల స్వభావమేర రియల్ లైఫ్ లో కూడా ఉంటుందని ఆలోచించే వారు ఎందరో. సినిమాను ఫన్ కోసం మూవీగా చూడకుండా రియల్ లైఫ్ లోకి ఆపాదించుకుంటారు.
ఇక అందులో నెగెటివ్స్ క్యారెక్టర్స్ చేసే వాళ్లు ఎదుర్కునే ఇబ్బందులు అంతా ఇంతా కాదు. వాళ్లను నిజమైన చెడ్డవారిగా భావించి బెదిరింపులకు పాల్పడుతుంటారు. అలా తాజాగా సూపర్ హిట్ మూవీ బేబి (Baby Movie) నటి సీత లైంగిక వేధింపులు ఎదుర్కొంది.

వసూళ్ల పరంపర: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా బేబి (Baby). 2017లో అర్జున్ రెడ్డి, 2018 ఆర్ఎక్స్ 100 చిత్రాలు ఎలాగే 2023లో బేబి సినిమా అన్నట్లుగా తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు సినిమాపై ఫుల్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. జూలై 14న విడుదలైన ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తోంది. ఫలితంగా వసూళ్ల పరంపర కొనసాగిస్తోంది.

సంపూర్ణేష్ బాబు: ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంతో వచ్చిన బేబి సినిమాకు సంపూర్ణేష్ బాబుతో హృదయ కాలేయం, కొబ్బరి మట్ట సినిమాల దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించారు. అలాగే విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమాను డైరెక్టర్ మారుతీ, ఎస్‍కేఎన్ (శ్రీనివాస కుమార్) సంయుక్తంగా మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మించారు.

నెగెటివ్ రోల్: బేబి సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా వరల్డ్ వైడ్ గా 10 రోజుల్లో రూ. 66.6 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి మిడ్ రెంజ్ సినిమాల్లో అరుదైన రికార్డ్ సాధించింది. ఇక బేబి సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా వైష్ణవి చైతన్య నటనకు క్రిటిక్స్ సైతం ప్రశంసలు కురిపించారు. అయితే అందులో ఆమె రోల్ కాస్తా నెగెటివ్ ఉండటంతో ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ముందే చెప్పారు: అలాగే వైష్ణవి చైతన్యకు స్నేహితురాలిగా కిరాక్ సీత కూడా నెగెటివ్ రోల్ ప్లే చేసింది. ఆమె రోల్ సినిమా వరకే అయినా అది నిజ జీవితంలో ఇబ్బందులు తీసుకొచ్చిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది సీత. అంతేకాకుండా ఈ సినిమాలో రాసిన తన పాత్ర వల్ల ఇలాంటి సమస్యలు ఎదురు అవుతాయని డైరెక్టర్ సాయి రాజేష్ ముందే చెప్పారని కూడా తెలిపింది.

చంపేస్తామని: "ఓ ఈవెంట్ కు నేను వెళ్లొస్తున్న సమయంలో కొందరు కుర్రాళ్లు నా వెంటబడ్డారు. నా స్నేహితులకు ఫోన్ చేసి ఈ విషయం చెబితే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వమని సలహా ఇచ్చారు. కానీ, నేను అలా చేయలేదు. కొందరైతే నన్ను రేప్ చేస్తాం. చంపేస్తామని కూడా బెదిరించారు. మరికొందరు నా అడ్రస్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ, నేను వీటన్నింటిని లైట్ తీసుకున్నాను" అని కిరాక్ సీత తెలిపింది.

కారణం ఒక్కటే: "నన్ను అంతలా బెదిరించినా సరే వాటిని నేను లైట్ తీసుకోవడానికి కారణం ఒక్కటే. నా రీల్ లైఫ్ క్యారెక్టర్ చూసి.. వాళ్లు అలా అభిప్రాయానికి వచ్చారు. కానీ, నా నిజ జీవితం వేరే అని వాళ్లకు తెలియదు. అందుకే వాటిని అంతగా పట్టించుకోలేదు. బేబిలో పాత్ర వల్ల ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని డైరెక్టర్ నాకు ముందే చెప్పారు" అని సీత చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











