రాజా సాబ్ ను తొక్కేసే ప్రయత్నం.. అసలు విషయం బయట పెట్టిన బేబీ నిర్మాత
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ది రాజా సాబ్. ప్రభాస్ నుంచి చివరిగా సలార్, కల్కి 2898 ఏడీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ తర్వాత ప్రభాస్ ది రాజా సాబ్ చిత్రంతోనే ప్రేక్షకులను అలరించబోతున్నాడు. కాగా ఎప్పటినుంచో ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. కాగా తాజాగా ది రాజా సాబ్ టీజర్ విడుదలైంది. ఈ క్రమంలో టీజర్ లాంచ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ముందుగానే రాజా సాబ్ చిత్రానికి అడ్డంకులు..
దర్శకుడు మారుతీకి పక్కా కమర్షియల్ చిత్రం బెడిసి కొట్టడంతో నెక్స్ట్ సినిమా విషయంలో కాస్త ఇబ్బందులు ఏర్పడ్డాయి. అలాంటి సమయంలో మారుతికి ప్రభాస్ సినిమా ఛాన్స్ ఇచ్చారు. అయితే ఈ చిత్రాన్ని మొదటగా టాలీవుడ్ లో భారీ చిత్రాలను నిర్మిస్తున్న ప్రముఖ సంస్థ నిర్మించడానికి ముందుకు వచ్చింది. కానీ తర్వాత పలు కారణాలతో ఆ సంస్థ వెనక్కి వెళ్ళింది. కొద్ది రోజులకు పీపుల్స్ మీడియా రంగంలోకి దిగింది. అలా మొదట్లోనే ఈ సినిమాకు ఎదురు దెబ్బ పడింది.

రాజా సాబ్ చిత్రాన్ని తొక్కేసే ప్రయత్నం..
తాజాగా రాజా సాబ్ చిత్రం టీజర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా గ్రాండ్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈవెంట్ లో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, బేబీ సినిమా ప్రొడ్యూసర్ ఎస్ కే ఎన్ మాట్లాడారు. రాజా సాబ్ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తొక్కేయాలని చూస్తున్నారని ఆయన వాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. దర్శకుడు మారుతిని కూడా ఇబ్బందుల పాలు చేశారని చెప్పుకొచ్చారు. ఇంతకు ఆయన ఎవరనేది మాత్రం చెప్పలేదు. కానీ రాజా సాబ్ చిత్రంతో ఇండియాను షేక్ చేస్తామని, ఇకపై ఆపడం ఎవరి వల్ల కాదని అన్నారు.
టీజర్ పై స్వల్పపాటి ట్రోల్స్..
రాజా సాబ్ టీజర్ జూన్ 16 ఉదయం 11 గంటల ప్రాంతంలో గ్రాండ్గా విడుదలైంది. టీజర్ కు అన్ని భాషల నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రభాస్ వింటేజ్ లుక్, గ్రాండ్ విజువల్స్, అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకుంటుంది. మరోవైపు దర్శకుడి మారుతి మార్కు కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం మిలియన్లలో టీజర్ కు వ్యూస్ దక్కుతున్నాయి. టాప్ వన్ లో ట్రెండింగ్ అవుతుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ప్రభాస్ లుక్ పై, టీజర్ పై కొందరు కావాలనే ట్రోల్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా ఎక్స్ లో దర్శనమిస్తున్నాయి.
భారీ బడ్జెట్ తో రాజా సాబ్..
రాజా సాబ్ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. నిర్మాత టీజీ విశ్వప్రసాద్, వివేక్ ఈ చిత్రాన్ని రూ.350 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు. మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











