Baby Teaser Review ముద్దు పెట్టుకొంటా.. ఆనంద్ దేవరకొండ.. చెప్పుతో కొడుతా.. హీరోయిన్ వార్నింగ్
మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి రాజేశ్ దర్శకత్వంలో నిర్మాత ఎస్కేఎన్, మారుతి రూపొందించిన చిత్రం బేబీ. ఆనంద్ దేవరకొండ, వైష్ణవవీ చైతన్య హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఆవిష్కరించారు. ఈ వేడుకలో హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ఈ సినిమా టీజర్ వివరాల్లోకి వెళితే..

స్కూల్ స్థాయిలో ప్రేమకథ..
బేబీ మూవీ స్యూల్ స్థాయి ప్రేమకథగా మొదలై.. యూత్‌ఫుల్ రొమాంటిక్‌గా కత ముగిసినట్టు టీజర్ స్పష్టం చేసింది. ఒక అబ్బాయి (ఆనంద్ దేవరకొండ) ని తన్మయత్మంతో ఆరాధించే ఓ అమ్మాయి (వైష్ణవి) కథ. అమ్మాయి. అబ్బాయి ఇద్దరి మధ్య స్కూల్ స్థాయిలో మొదలై.. ఒకరికొకరు ఐలవ్ యూ అంటూ తమ అభిప్రాయాలను పంచుకోవడం టీజర్‌లో ఫీల్‌గుడ్‌గా కనిపించింది.

చెప్పు తెగుద్దంటా అంటూ వైష్ణవి
ఇక అబ్బాయి, అమ్మాయి మధ్య ప్రేమ వ్యవహారం ముదిరి.. ఫిజికల్ ఎట్రాక్షన్ వరకు వెళ్లడం టీజర్‌లో కనిపించింది. అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.,. ముద్దు పెట్టుకోవచ్చా? అని అడిగితే.. చెప్పు తెగుద్దంటా అంటూ అమ్మయి సమాధానం ఇవ్వడం రొమాంటిక్‌కు ఉన్న స్కోప్ ఏంటో టీజర్ చెప్పింది.

కుడి కన్ను అదిరితే మంచి జరుగుతుందని
ఇక టీజర్ చివర్లలో.. తన ప్రేమ గురించి అమ్మాయి పడే వేదన హృదయాన్ని కదిలించేలా కనిపించింది. కుడి కన్ను అదిరితే మంచి జరుగుతుందని, ఎడమ కన్ను అదిరితే.. చెడు జరుగుతుందని.. కానీ ఏదో జరుగబోతుందని అనిపించినప్పుడు అమ్మాయిలకు గుండె అదిరిపోతుంది అని చెప్పడం సినిమాపై అంచనాలు పెంచేలా చేసింది.

బీజీఎం ఫీల్‌గుడ్‌గా
గ్రామీణ నేపథ్యంతో కూడిన ప్రేమ కథగా రూపొందిన బేబీ సినిమాకు బాల్ రెడ్డి అందించిన సినిమాటోగ్రఫి ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్స్‌ను అందించింది. పాత్రల తీరుతో నేటివిటి ఉట్టిపడేలా చేసింది. ఇక విజయ్ బుల్గానిన్ అందించిన బీజీఎం హృదయానికి హత్తుకొనేలా ఉంది. యూత్‌ఫుల్ రొమాంటిక్‌గా బేబీ మారడం ఖాయమనే సంకేతాలను ఇచ్చింది.

బేబీలో నటీనటుల, సాంకేతిక నిపుణుల
నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య, విరాజ్ అశ్విన్, నాగబాబు, లిరిషా, కుసుమ తదితరులు
రచన, దర్శకత్వం: సాయి రాజేశ్
నిర్మాత: ఎస్కేఎన్
సహ నిర్మాత: ధీరజ్ మొగిలినేని
మ్యూజిక్: విజయ్ బుల్గానియన్
డీవోపీ: ఎంఎన్ బాల్‌రెడ్డి
ఎడిటర్: విప్లవ్ నైషాద్యం
కొరియోగ్రాఫర్: విజయ్ పోలంకి
బ్యానర్: మాస్ మూవీ మేకర్స్


Click it and Unblock the Notifications











