పిఠాపురంలో వర్మపై దాడి.. కుట్రలను బయటపెట్టిన టాలీవుడ్ నిర్మాత.. వర్మ రియాక్షన్ (వీడియో)
పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయోత్సవాలు ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో వాటిని అడ్డుకొనేందుకు కొందరు చేసిన కుట్రలను టాలీవుడ్ నిర్మాత, బేబీ ఫేమ్ ఎస్‌కేఎన్ (శ్రీనివాస కుమార్) అసలు విషయాన్ని బయటపెట్టారు. అయితే టీడీపీ, జనసేన మధ్య విభేదాలు అంటూ మీడియాలో వస్తున్న కట్టుకథలకు చెక్ చెప్పేందుకు సంఘటనా స్థలంలో జరిగిన విషయాలను, అలాగే జనసేన దాడి అంటూ జరుగుతున్న ప్రచారంపై వర్మ స్వయంగా ఇచ్చిన రియాక్షన్ వివరాల్లోకి వెళితే..
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, తాజా ఎన్నికల్లో పవన్ కల్యాణ్ విజయానికి విశేషమైన కృషి చేసిన టీడీపీ నాయకుడు వర్మపై జనసేన నాయకుల దాడి చేశారంటూ ఓ వార్త మీడియాలో స్వైర విహారం చేసింది. ఈ సంఘటన గొల్లప్రోలు మండలం, వన్నెపూడి గ్రామంలో ఘటన చోటు చేసుకొన్నది. ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే వర్మ కారు పూర్తిగా ధ్వంసమైంది. అయితే ఈ ఘటనకు జనసైనికులే బాధ్యత అంటూ వస్తున్న ఆరోపణలను ఖండించారు.

ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ లాంటి సభ్యత, సంస్కారం ఉన్న వ్యక్తి వద్ద ఎలక్షన్ నిర్వాహణ చేసినందుకు గర్వంగా ఉంది. ఆయన నుంచి ఏ విధమైన ఇబ్బందులు లేవు. మేము ఎప్పుడూ ఒకే కుటుంబంలా కలిసి ఎలక్షన్ చేశాం. గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఐదు నెలల క్రితం 25 మంది స్థానిక ఎంపీ వర్గంలో చేరారు. వారే ఈ దాడి చేశారు. జనసేనలో ఉన్న పాత నేతలకు, పవన్ కల్యాణ్ సంబంధం లేదు. మా ఎంపీ వర్గమే దాడి చేసింది. అందచేత ఇలా చాలా అవుతుంటాయి. మేము దద్దమ్మలం కాదు. పోలీసులు ఉన్నప్పుడు జరిగింది అని వర్మ అన్నారు. ఇంకా పూర్తిగా ఆయన చెప్పిన వివరాల్లోకి వెళితే..


Click it and Unblock the Notifications











