వీడెవడు చైల్డ్ ఆర్టిస్టా.. Baby హీరోయిన్ వైష్ణవి చైతన్య తమ్ముడు చేసిన పనికి ఫ్యాన్స్ ఫైర్
చిన్న పాత్రలు, నెగెటివ్ రోల్స్ చేస్తూ రౌడీ హీరోగా ఎదిగాడు విజయ్ దేవరకొండ. ఎవడే సుబ్రహ్మణ్యం, పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో మంచి క్రేజ్ తోపాటు భారీగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇండస్ట్రీలో సొంత టాలెంట్ తో పేరు తెచ్చుకున్న వాళ్లలో విజయ్ దేవరకొండ ఒకరు. ఇటీవల విజయ్ లైగర్ తో ప్లాప్ చూసిన ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ మాత్రం బేబితో కల్ట్ క్లాసిక్ హిట్ కొట్టాడు. ఇందులో హీరోయిన్ గా చేసిన వైష్ణవి చైతన్యకు సూపర్ క్రేజ్ వచ్చింది. అయితే తాజాగా ఆమె తమ్ముడు చేసిన పనికి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్, నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అసలు ఏమైందనే విషయంలోకి వెళ్తే..
ప్రశంసలు:ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపిస్తున్న సినిమా పేరు బేబి (Baby Movie 2023). ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులతోపాటు సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ సినిమాను హృదయ కాలేయం, కొబ్బరి మట్ట సినిమాల దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించారు.

సూపర్ క్రేజ్:డైరెక్టర్ మారుతీ, ఎస్‍కేఎన్ (శ్రీనివాస కుమార్) సంయుక్తంగా మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మించిన బేబి సినిమాకు విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. జూలై 14న విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ కలెక్షన్లు రాబట్టడంలో సత్తా చాటుతుంది. ఎంతోమంది ప్రశంసలు అందుకుంటున్న బేబి సినిమా ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. దీంతో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యకు సూపర్ క్రేజ్ వచ్చింది. ఈ సినిమా సక్సెస్ తర్వాత వీళ్లిద్దరు విజయ్ దేవరకొండతో కలిసి ఫొటోలు దిగారు. అందులో వైష్ణవి తమ్ముడు కూడా ఉన్నాడు.
హీరోలా స్టిల్:విజయ్ దేవరకొండతో వైష్ణవి తమ్ముడు ఫొటో దిగడం వరకు బాగానే ఉంది. కానీ, ఆ ఫొటోలో హీరోయిన్ తమ్ముడు నితిష్ చైతన్య (Nitish Chaitanya) చేసిన పనికి విజయ్ ఫ్యాన్స్ గుస్సా అవుతున్నారు. అంతలా అతను ఏం చేశాడంటే.. విజయ్ వెనుక నుంచి చేతులు వేసి హీరోలో పోజు ఇవ్వడమే. విజయ్ పక్కకు సాధారణంగా ఉంటే వైష్ణవి తమ్ముడు మాత్రం మధ్యలో హీరోలా స్టిల్ ఇచ్చాడు. దీంతో విజయ్ ఫ్యాన్స్ అతనిపై తెగ ఫైర్ అయిపోతున్నారు.
అదే మంచిది:ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దీనికి నెటిజన్లు, ఫ్యాన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. "నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా? అలా విజయ్ పైనా చేయి వేసి పోజు కొడుతున్నావ్.. నీతో ఫొటో దిగేందుకు విజయ్, ఆనంద్ మీ ఇంటికి వచ్చారా? కొంచెం యాటిట్యూడ్ తగ్గించుకుంటే మంచిది" అని ఘాటుగా స్పందిస్తున్నారు.
యాటిట్యూడ్ చింటూ:వైష్ణవి తమ్ముడిపై ట్రోలింగ్ భారీగానే జరుగుతోంది. "వీడేంటి అర్జున్ రెడ్డిలో ప్రీతి తమ్ముడిలా లుక్ ఇచ్చాడు", "వీడెవడు చైల్డ్ ఆర్టిస్టా?", "పెద్దవారితో ఎలా ప్రవర్తించాలో తమ్ముడికి వైష్ణవి అయినా చెప్పాలి కదా", "యాటిట్యూడ్ చింటూ" అంటా నానా రకాలుగా స్పందిస్తున్నారు. బేబితో వైష్ణవి చైతన్య పాపులారిటీ తెచ్చుకుంటే ఆమె తమ్ముడు ఇలా ఫేమస్ అయిపోయాడు.


Click it and Unblock the Notifications











