దక్షణాది భాషల్లో రీమేక్ కానున్న బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం!
బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన చిత్రాలని తెలుగుతో పాటు ఇతర దక్షణాది భాషల్లో రీమేక్ చేస్తుంటారు. ఇక్కడ విజయం సాధించిన చిత్రాలు కూడా బాలీవుడ్ లో రీమేక్ అవుతుంటాయి. ఇదిలా ఉండగా ఇటీవల బాలీవుడ్ లో చిన్న సినిమాగా విడుదలైన ఘనవిజయాన్ని అందుకున్న బాదాయి హో చిత్రాన్ని దక్షణాది భాషల్లో రీమేక్ చేయనున్నారు. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ఈ ఆలోచనకు శ్రీకారం చుట్టారట. ఆయన బాదాయి హో రీమేక్ హక్కులని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
తెలుగు, తమిళ, మలయాళీ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తక్కువ బడ్జెట్ లో చిన్న చిత్రంగా విడుదలైన బాదాయి హో 200 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. సౌత్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించే దర్శకులు,నటుల గురించి త్వరలో వివరాలు తెలియనున్నాయి. ఆయుష్మాన్ ఖురానా ఈ చిత్రంలో హీరోగా నటించాడు.

నీనా గుప్త కీలక పాత్రలో నటించగా సన్య మల్హోత్రా హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన క్వీన్ చిత్రాన్ని దక్షణాది భాషల్లో రీమేక్ చేస్తున్నారు. బోనీ కపూర్ కూడా అదే మార్గాన్ని ఎంచుకున్నారు. బోనీకపూర్ ప్రస్తుతం పింక్ రీమేక్ చిత్రాన్ని అజిత్ తో తమిళంలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











